Saturday, September 21, 2024
HomeTrending NewsYS Jagan: సెప్టెంబర్ నుంచి విశాఖలో: సిఎం జగన్

YS Jagan: సెప్టెంబర్ నుంచి విశాఖలో: సిఎం జగన్

సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం ఉండబోతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో పోర్టు పనులకు భూమి పూజ చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఈ విషయం వెల్లడించారు.  మే ౩న భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ పనులకు శంఖుస్థాపన చేస్తున్నట్లు చెప్పారు. పోర్టు నిర్మాణంతో శ్రీకాకుళం జిల్లాతో పాటు ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నేడు తలపెట్టిన నీటిపారుదల ప్రాజెక్టులతో కోస్తా ప్రాంతంతో సమానంగా ఇక్కడ కూడా రెండో పంటకు కూడా సాగునీరు అందుతుందని చెప్పారు. ఇదే జిల్లాలో ఉద్దానంలో నెలకొల్పిన  కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనులు పూర్తయ్యాయని, జూన్ లో దీన్ని ప్రారంభిస్తామని, దీనితో పాటు మే 3 న భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ పనులకు శ్రీకారం చుట్టబోతున్నామని, అదే రోజున అదానీ డేటా సెంటర్ కు కూడా శంఖుస్థాపన చేస్తున్నట్లు సిఎం తెలిపారు.


రాష్ట్రంలో అతి పెద్ద నగరంతో పాటు, అందరికీ ఆమోదయోగ్య నగరం విశాఖ అని,  పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా, సెప్టెంబర్‌ నుంచి ఇక్కడే పాలన సాగిస్తామని స్పష్టం చేశారు. ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలని, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే తపన అని, అన్ని జిల్లాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నామని తెలిపారు.

సిఎం మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు
  • మిగతా వాళ్లంతా ఏకమవుతున్నారు
  • అంతా ఏకమై నాతో చీకటి యుద్ధం చేస్తున్నారు
  • రాష్ట్రంలో పెత్తందార్లకు ..పేదల పక్షాన నిలబడిన నాకు మధ్య యుద్ధం జరుగుతోంది
  • ఒకే అబద్ధాన్ని పదేపదే చెబుతున్నారు, వాళ్లలా అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదు
  • ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం మీరే
  • ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరే
  • దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా
  • తోడేళ్లన్నీ ఏకమైనా.. నాకేమీ భయం లేదు
RELATED ARTICLES

Most Popular

న్యూస్