Sunday, January 19, 2025
HomeసినిమాRana Naidu Season 2: 'రానా నాయుడు' సీజన్ 2కి రంగం సిద్ధం!

Rana Naidu Season 2: ‘రానా నాయుడు’ సీజన్ 2కి రంగం సిద్ధం!

‘రానా నాయుడు’  సీజన్ 1 స్ట్రీమింగ్ కావడానికి ముందు భారీ అంచనాలు ఉన్నాయి. వెంకటేశ్ – రానా ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇక ఈ ఇద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించడం ఒక విశేషమైతే .. వెంకటేశ్ కి ఫస్టు వెబ్ సిరీస్ కావడం మరో విశేషం. అందువలన ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని చాలామంది ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు. తీరా వెబ్ సిరీస్ వచ్చాక,  ఇది పిల్లల కంటపడకుండా ఏం  చేయాలా అని పెద్దాళ్లంతా నానా తంటాలు పడ్డారు.

ఈ వెబ్ సిరీస్ కథ ముంబై నేపథ్యంలో జరుగుతుంది. కథలో టీనేజ్ పాత్రలు ఉన్నాయి .. మధ్య వయసు పాత్రలు ఉన్నాయి .. ముసలి పాత్రలు ఉన్నాయి. ఈ పాత్రలన్నీ కూడా అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తూ ఉంటాయి. అందరి లక్ష్యం శృంగారమే అన్నట్టుగా అడుగులు వేస్తుంటాయి. ఏ పాత్ర కూడా ఉన్నతంగా .. గౌరవంగా ప్రవర్తించదు. నైతిక విలువలు లేని ఈ పాత్రల ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడనేది అర్థం కాదు.

అలా ఫస్టు పార్టుతోనే అందరికీ షాక్ ఇచ్చిన ఈ వెబ్ సిరీస్ నుంచి ఇప్పుడు సీజన్ 2 ని వదులుతున్నారు. త్వరలోనే సీజన్ 2ను స్ట్రీమింగ్ చేయనున్నట్టు నెట్ ఫ్లిక్స్ వారు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన చిన్నపాటి వీడియోను కూడా రిలీజ్ చేశారు. త్వరలోనే డేట్ ను ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఫస్టు పార్టు అనేక విమర్శలను మూటగట్టుకున్నప్పటికీ, సీజన్ 2లో బూతుల మోతాదును ఏమైనా తగ్గించి ఉంటారా అనేది అనుమానమే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్