Thursday, June 18, 2026
HomeసినిమాSaindhav: 'సైంధవ్' లో హిట్ హీరోయిన్

Saindhav: ‘సైంధవ్’ లో హిట్ హీరోయిన్

వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రం ‘సైంధవ్’. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కొంత మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో నటించనున్నారు. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిక్ ఈ చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది.
ఇప్పుడు ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఇందులో డాక్టర్ రేణు పాత్రను రుహాని శర్మ పోషిస్తోంది. దర్శకుడి మొదటి చిత్రం ‘HIT’లో కనిపించిన రుహాని సైంధవ్‌లో కీలక పాత్ర పోషిస్తుంది.

క్యారెక్టర్ లుక్ పోస్టర్‌లో రుహానీ శర్మ సీరియస్ గా కనిపిస్తోంది. నటీనటుల ఎంపికకు సంబంధించి ఒక్కో అనౌన్స్ మెంట్ ఉత్కంఠను రేపుతోంది. ఈ ఆసక్తికరమైన స్టార్ కాస్ట్ తో శైలేష్ ఏం చేస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా వుంది. ప్రధాన తారాగణం పాల్గొంటున్న సైంధవ్ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇతర నటీనటులను త్వరలో మేకర్స్ అనౌన్స్ చేస్తారు. సైంధవ్  పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular