Thursday, June 18, 2026
HomeTrending NewsYerragondapalem Incident: ఇంత దిగజారాలా?: యనమల

Yerragondapalem Incident: ఇంత దిగజారాలా?: యనమల

జగన్ కు ఓటమి భయం పట్టుకుందని, ఆ అసహనంతోనే దాడులు చేయిస్తున్నారని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ళ దాడి… జగన్ అరాచక పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలన తుదిదశకు చేరుకుందన్నారు. మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ అర్ధ నగ్న ప్రదర్శన చూసి ప్రజాస్వామ్యమే సిగ్గుపడుతుందని వ్యాఖ్యానించారు. జగన్ మెప్పు కోసం మరీ ఇంతగా దిగజారాలా అంటూ ప్రశ్నించారు.

కాగా,  ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెంలో నిన్న జరిగిన దాడి ఘటనను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. కేంద్ర బలగాల భద్రత ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు వాహనంపై రాళ్ళు విసరడంపై ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీతో పాటు, డిజిపి కి కూడా ఫిర్యాదు చేయాలని, అ తర్వాత గవర్నర్ ను కలవాలని నిర్ణయించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా ఈ ఘటనను తీసుకెళ్లాలని భావిస్తోంది. టిడిపి అధినేత చంద్రబాబు ఈ ఉదయం పార్టీ సీనియర్ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular