తెలుగు అకాడమిని తెలుగు & సంస్కృత అకాడమి గా పేరు మార్చటం తప్పులేదని తెలుగు & సంస్కృత అకాడమి ఛైర్మెన్ డా” నందమూరి లక్ష్మీపార్వతి పునరుద్ఘాటించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు & సంస్కృత అకాడమీ బాషా చైతన్య సదస్సు జరిగింది. ఈ సదస్సుకు లక్ష్మీ పార్వతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాగార్జున యూనివర్సిటీ రెక్టార్ వరప్రసాదమూర్తి, ప్రొఫెసర్లు, మేధావులు పాల్గొన్నారు.
నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ
- తెలుగు భాషమీద గౌరవం పెంపొందించేలా సంసృత బాష అనుసంధానంగా బాషా చైతన్య సదస్సుని నిర్వహిస్తున్నాం
- తెలుగు భాష సంస్కృత భాష నుంచే మమేకమైనదని అందరు గమనించాలి.
- గత ప్రభుత్వంలో చంద్రబాబు తెలుగు అకాడమీని పూర్తిగా నిర్వీర్యం చేశారు
- గత ప్రభుత్వంలో పాఠ్యపుస్తకాల ముద్రణను నారాయణ సంస్థలకు అప్పజెప్పటం అవి బ్లాక్ మార్కెట్ చేయటంతో విద్యార్థులు నష్టపోయారు
- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తెలుగు అకాడమీకి పూర్వ వైభవం వచ్చింది
- తిరుపతి లో తెలుగు &సంసృతం అకాడమీ భవనం నెలకొల్పారు
- పాఠ్యపుస్తకాల ముద్రణను చేపట్టాం
- విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి
భాషాభివృద్ధి లక్ష్యంతో బాషా చైతన్య సదస్సులను రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో నిర్వహిస్తామని ఆమె వెల్లడించారు.