Tuesday, March 17, 2026
HomeసినిమాAgent: అఖిల్ కోసం రంగంలోకి గ్లోబల్ స్టార్..?

Agent: అఖిల్ కోసం రంగంలోకి గ్లోబల్ స్టార్..?

అక్కినేని అఖిల్ నటించిన భారీ పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’.  సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా  28న రిలీజ్ కానుంది. అయితే… అఖిల్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కానీ.. కుదరడం లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీతో విజయం సాధించాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే.. బ్లాక్ బస్టర్ సాధించాలని  అఖిల్ పట్టుదలగా ఉన్నాడు.

వరంగల్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కింగ్ నాగార్జున గెస్ట్ గా వచ్చారు. ఏజెంట్ మూవీ కోసం హైదరాబాద్ లో మరో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్ కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా రానున్నారని టాక్ వినిపిస్తుంది. చిరంజీవి, నాగార్జున ఇద్దరు మిత్రులు. అలాగే చరణ్, అఖిల్ కూడా మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు అఖిల్ కోసం చరణ్ రంగంలోకి దిగనున్నారని సమాచారం. అయితే.. ఈ ఈవెంట్ ఎప్పుడనేది త్వరలో ప్రకటించనున్నారు. ఈ నెల 15 నుంచి ఎక్కడా ఖాళీ లేకుండా వరుసగా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ.. దూసుకెళుతుంది ఏజెంట్ టీమ్.

ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రోజురోజుకు ఏజెంట్ మూవీ పై అంచనాలు పెరుగుతుండడంతో సినిమా పై ఆడియన్స్ లో మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ నెల 28న వరల్డ్ వైడ్ గా ఏజెంట్ భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. అక్కినేని అఖిల్, అలాగే అక్కినేని అభిమానులు ఏజెంట్ సక్సెస్ పై చాలా నమ్మకంగా ఉన్నారు. మరి.. అంచనాలకు తగ్గట్టుగా ఏజెంట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular