Friday, June 19, 2026
HomeసినిమాAgent Pre Release: ఎందువలన 'ఏజెంట్' బ్లాక్ బస్టర్ అవుతుందంటే ..!: నాగ్ 

Agent Pre Release: ఎందువలన ‘ఏజెంట్’ బ్లాక్ బస్టర్ అవుతుందంటే ..!: నాగ్ 

అఖిల్ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అవుతోంది. అయినా తన నేపథ్యానికి తగిన స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం పడలేదనే చెప్పాలి. అలాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోసమే ఆయన చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఇక నాగార్జున కూడా అలాంటి సమయం కోసమే ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ‘ఏజెంట్’ సినిమాను చేశాడు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా థియేటర్లలో దిగిపోనుంది.

నాగార్జున చీఫ్ గెస్టుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న రాత్రి ‘వరంగల్’ లో నిర్వహించారు. ఈ  వేదికఫై నాగార్జున మాట్లాడుతూ .. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెబుతూ, అందుకుగల కారణాలను ప్రస్తావించారు. సురేందర్ రెడ్డి .. అనిల్ సుంకర ఇంతకుముందు భారీ హిట్లు ఇచ్చి ఉన్నారు గనుక, ఈ సారి కూడా తప్పకుండా హిట్ ఇస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక మమ్ముట్టి కథపై నమ్మకంతో ఈ సినిమాను ఒప్పుకోవడం కూడా హిట్ పై ఆశలు పెంచుతుందని చెప్పారు.

అఖిల్ కి మొదటి నుంచి కూడా చాలా ఎనర్జీ ఎక్కువనీ .. తన చిన్నప్పటి నుంచి ఆ ఎనర్జీ లెవెల్స్ ను అందుకోవడం తమకి కష్టంగా ఉండేదని అన్నారు. తను ఈ సినిమా కోసం కష్టం .. చేసిన కసరత్తు చూసిన తరువాత తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం వచ్చిందని చెప్పారు. ఇక అభిమానులు ఆదరిస్తున్న తీరు .. ఈ సినిమా పట్ల చూపుతున్న ఆసక్తి తన నమ్మకాన్ని మరింత పెంచుతుందంటూ చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular