Thursday, March 19, 2026
HomeసినిమాChiranjeevi: దసరా డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్..?

Chiranjeevi: దసరా డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్..?

చిరంజీవి వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా సినిమాలు చేసేందుకు కథలు వింటున్నారు. రచయిత బి.వి.ఎస్. రవి చెప్పిన కథకు ఓకే చెప్పారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం బివిఎస్ రవి ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారు. బి.వి.ఎస్. రవితో పాటు డైరెక్టర్ మల్లిడి వశిష్ట్, రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్, కళ్యాణ్ కృష్ణ, నక్కిన త్రినాథరావు తదితర దర్శకులు చిరంజీవికి కథలు చెప్పడం జరిగింది. అలాగే వీళ్లకు ఫుల్ స్టోరీ రెడీ చేయండి సినిమా చేద్దామని మాట ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఎవరు ఫస్ట్ ఫుల్ స్ర్కిప్ట్ తో మెప్పిస్తే వాళ్ల ప్రాజెక్ట్ ముందుగా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది.

ఇదిలా ఉంటే.. చిరు, తాజాగా దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన శ్రీకాంత్ ఓదెలతో కూడా సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. దసరా సినిమా చూసిన తర్వాత ఆయన టీమ్ అందర్నీ అభినందిస్తూ ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ చూసిన శ్రీకాంత్… తను చిన్నప్పుడు ఇంద్ర సినిమాలోని చిరంజీవి స్టెప్ వేస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇలా ఉంది నా పరిస్థితి అంటూ స్పందించాడు. ఈ విధంగా తను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ అభిమానిని అని చెప్పాడు.

ఇది చిరంజీవిని ఆకట్టుకుందో ఏమో కానీ.. శ్రీకాంత్ ఓదెలను కథ ఉంటే చెప్పమన్నారని..  కథ చెప్పడం జరిగిందని వార్తలు వస్తున్నాయి. స్టోరీ లైన్ బాగుండడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నారట. ప్రస్తుతం ఫుల్ స్టోరీ రెడీ చేసే పనిలో ఉన్నాడని టాక్ వినిపిస్తుంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చిరుకు ఎంతో మంది యంగ్ డైరెక్టర్స్ కథలు వినిపించారు కదా… శ్రీకాంత్ ఓదెల నెంబర్ ఎంత..? అని సోషల్ మీడియాలోనెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగి ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే.. శ్రీకాంత్ ఓదెలకు మరింత క్రేజ్ రావడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular