Thursday, June 18, 2026
HomeTrending NewsRains: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్‌

Rains: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్‌

ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో ఈ రోజు (బుధవారం) ఉదయం వరకు ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది.

అంతేకాకుండా.. పలు ప్రాంతాల్లో వడగళ్లవాన కురిసే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అధికారులు తెలిపారు. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో.. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, రంగారెడ్డి వడగళ్ల వానలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular