మహిళల స్వయం సాధికారితకోసం ప్రభుత్వం అమలు చేస్తోన్నచేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పథకాల ద్వారా వారికి జీవనోపాధి కల్పించే మార్గాలను మరింత విస్తృతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వం బ్యాంకుల సహాయంతో స్వయం ఉపాధి మార్గాలను అమలు చేస్తోందని అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలపై క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఎం చేసిన సూచనల్లో ముఖ్యాంశాలు:
- ప్రభుత్వ పథకాలతో గ్రామ స్థాయిలో సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా వేగంగా అడుగులుపడతాయి
- బ్యాంకుల నుంచి కూడా రుణాలు ఇప్పించి ఉపాధి మార్గాలను సమర్థవంతంగా కొనసాగించాలి
- మహిళలు తయారు చేస్తున్న వస్తువులు, ఉత్పాదనలకు సంబంధించి మంచి మార్కెట్ వ్యవస్ధ ఉండాలి, దీనికోసం బహుళజాతి కంపెనీలతో అనుసంధానం కావాలి
- గ్రామీణ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను మార్కెట్ ధర కంటే తక్కువకే అందించాలన్న లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల మహిళలతో సూపర్ మార్కెట్‌లు ఏర్పాటుకు నిర్ణయం
- జిల్లాకు కనీసం రెండు సూపర్ మార్కెట్‌లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపిన అధికారులు.
- తొలి దశలో 27 చేయూత మహిళా మార్టుల ఏర్పాటు. ఒక్కో సూపర్ మార్టులో కనీసం నెలకు రూ.30 లక్షలు టర్నోవర్ లక్ష్యం
- వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు డోర్ డెలివరీ, ఆన్‌లైన్ బుకింగ్, వాట్సప్ బుకింగ్ సౌకర్యా్ని అందుబాటులోకి తెస్తున్నామన్న అధికారులు.
- మల్టీ నేషన్ కంపెనీలతో భాగస్వామ్యం వల్ల వారి ఉత్పత్తుల్లో కనీసం 8 నుంచి 25 శాతం మార్జిన్ ఉండేట్టు ఏర్పాటు చేశామని వెల్లడి.
- కాకినాడ జిల్లాలో సామర్లకోటలో వస్త్ర పేరుతో ఏర్పాటు చేసిన దుస్తుల తయారీ యూనిట్‌లో 200 మంది మహిళలకు ఉపాధి.
- ట్రెండ్స్, అజియో వంటి కంపెనీలతో ఒప్పందం.
- చిత్తూరు జిల్లా కురుబలకోటలో చింతపండు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు.
- ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 3వేల కుటుంబాలకు చేయూత.
ఉపాధి హామీపైనా సమీక్ష.
- ఉపాథి హామీలో భాగంగా ఈ ఏడాది 1500 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకూ 215.17 లక్షల పనిదినాల కల్పన జరిగిందని. అధికారుల వెల్లడి
- గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్కులు పూర్తిచేయాలన్న సీఎం.
- గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీల నిర్మాణం పైన కూడా దృష్టిపెట్టాలని సూచన
- గ్రామాల్లో రోడ్ల నాణ్యత పైనా దృష్టి పెట్టాలని, రోడ్డు వేస్తే కనీసం ఐదేళ్లపాటు నిలిచేలా నాణ్యత పాటించాలన్న సిఎం
ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ సూర్యకుమారి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ పి బసంత్ కుమార్, సెర్ప్ సీఈఓ ఏ ఎండి ఇంతియాజ్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.