Tuesday, June 16, 2026
Homeసినిమా#RC16: చరణ్ నెక్ట్స్ మూవీ బయోపిక్ కాదట

#RC16: చరణ్ నెక్ట్స్ మూవీ బయోపిక్ కాదట

చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. చరణ్ కు జంటగా కైరా అద్వానీ నటిస్తుంది. శ్రీకాంత్, సునీల్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.జె.సూర్య విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి క్లైమాక్స్ ను భారీగా ప్లాన్ చేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి కానీ.. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రకటిస్తారని సమాచారం.

ఇక ఈ సినిమా తర్వాత చరణ్‌ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ సంస్థ నిర్మిస్తుంది. ఈ మూవీని ఆల్రెడీ ప్రకటించారు కానీ.. ఇంకా స్టార్ట్ కాలేదు. ఇందులో చరణ్ కు జంటగా జాన్వీ కపూర్ నటించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని టాక్ వచ్చింది. రీసెంట్ గా .. ఈ మూవీ ఓ ప్రముఖ వ్యక్తికి చెందిన బయోపిక్ అని ప్రచారం జరుగుతుంది.

ఈ ప్రచారంలో ఉన్న వార్తలు వైరల్ గా మారాయి. దీని పై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఈ సినిమా అసలు ఎలాంటి బయోపిక్ కాదని ఎవరి జీవితంతో కూడా సంబంధం లేని కథ అని తెలిసింది. అలాగే బుచ్చిబాబు పూర్తిగా ఫిక్షనల్ స్టోరీను చరణ్ కోసం సిద్ధం చేశాడని టాక్. దీనితో ప్రచారంలో ఉన్న వార్తల్లో వాస్తవం లేదని తెలిసింది. మరి.. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అంటే.. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. త్వరలోనే మేకర్స్ పూర్తి వివరాలను అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular