Sunday, November 24, 2024
HomeTrending NewsSecretariat: ముస్తాబైన బిఆర్ అంబేద్కర్ సచివాలయం

Secretariat: ముస్తాబైన బిఆర్ అంబేద్కర్ సచివాలయం

ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈనెల 30వ తేదీప్రారంభం కానున్న తెలంగాణ సెక్రటేరియట్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. నిరంతరం 300మంది స్పెషల్ పోలీసులు, సీసీ కెమెరాల మధ్య భద్రత కొనసాగుతుంది. హైందవ సంస్కృతితో పాటు హైదరాబాద్ నిజామీ ఆర్కిటెక్చర్ తో రెండు ఎకరాలలో రోడ్ల నిర్మాణం, ఐదు ఎకరాలలో పార్కుల నిర్మాణం జరిగింది. మంత్రులు, కార్యదర్శులు, సెక్షన్ ఒకే దగ్గర ఉండేలా రూపకల్పన చేశారు. త్వరగా పనులు అయ్యేలా (నాలుగు రోజులలో అయ్యేపని ఒకే రోజు లో అయ్యేలా) అన్ని సౌకర్యాలతో ఈ నిర్మాణం జరిగింది. మొత్తం 28 ఎకరాల సువిశాల ప్రాంతంలో రెండున్నర మూడు ఎకరాలలోనే మెయిన్ బిల్డింగ్, తొంబై శాతం ఓపెన్ పదిశాతం భవనాల నిర్మాణం, మిగతా అంతా ఓపెన్ పార్క్స్ , లాన్స్ , రోడ్ల నిర్మాణం ఉంది.
లోయర్ గ్రౌండ్ , గ్రౌండ్ , ఆరు ఫ్లోర్ లు నిర్మించడం ఒక భాగం అయితే మరో భాగంలో నాలుగు అంతస్తులు నిర్మించడం జరిగింది. లోయర్ గ్రౌండ్ లో అన్ని రకాల సర్వీసెస్ ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ముగ్గురు మినిష్టర్స్ ఉంటారు. ఫస్ట్ నుంచి ఐదు ఫ్లోర్ ల వరకు ఫ్లోర్ కు నలుగురు మినిష్టర్ లు చొప్పున ఇరవై మంది మినిష్టర్ లు డిపార్డ్ మెంట్ లు ఉండే విధంగా నిర్మించారు. మొత్తం 12 ఫ్లోర్స్ లలో నిర్మించిన ఈ భవనంలో ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి సీఎంవో సిబ్బంది ఉండే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
విదేశీ ప్రతినిధులతో కానీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కానీ సమావేశాలు జరుపుకునే విదంగా నాలుగు హాల్స్ అన్ని సౌకర్యాలతో నిర్మించారు.  ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు కేబినెట్ మంత్రులు డీజీపీ , సీఎంవో సిబ్బంది మెయిన్ గేట్ ( తూర్పు ద్వారం) నుంచి రావడం జరుగుతుంది. ఎంఫ్లాయ్స్ ఇతర సిబ్బంది నార్త్ ఈస్ట్ గేట్ (ఈశాన్య ద్వారం) నుంచి రావడం జరుగుతుంది. సౌత్ ఈస్ట్ గేట్(ఆగ్నేయ ద్వారం) నుంచి సందర్శకులు రావటానికి ఏర్పాట్లు చేశారు. నాలుగు స్థాయిలలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
నాలుగు ద్వారాలతో శ్వేతసౌదంగా వీక్షకులను ఆకట్టుకుంటున్న ఈ భవనాన్ని అన్ని హంగులతో 617 కోట్ల వ్యయంతో నిర్మించామని రోడ్లు భవనాలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. సీఎం అభిరుచికి ఏ మాత్రం తగ్గకుండా ఆకర్షణీయంగా కట్టడానికి తాను సివిల్ ఇంజనీరింగ్ చదవడం వల్ల ప్లానింగ్ చేయడంలో కో ఆర్డినేషన్ చేయడంలో తనకు కలసి వచ్చిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్