Friday, June 19, 2026
HomeసినిమాSharwanand: శర్వానంద్ ఇక స్పీడ్ పెంచాల్సిందే!

Sharwanand: శర్వానంద్ ఇక స్పీడ్ పెంచాల్సిందే!

టాలీవుడ్ హీరోలలో శర్వానంద్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది. విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకోవడంలో నాని తరువాత ఆయన పేరునే చెబుతూ వచ్చారు. అలాంటి శర్వానంద్ ఆ మధ్య వరుస ఫ్లాపులను ఫేస్ చేస్తూ వచ్చాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలనే ఎంచుకుంటూ వచ్చినా, కొత్తదనం కోసం ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. అలా ఆయన ఏకంగా అరడజను ఫ్లాపులను తన ఖాతాలో వేసుకోవలసి వచ్చింది.

చివరిగా ఆయన చేసిన ‘ఒకే ఒక జీవితం’ కూడా ఒక మంచి ప్రయత్నంగానే నిలిచింది. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన తాను కొంత గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నట్టుగా చెప్పాడు. అన్నట్టుగానే ఆయన గ్యాప్ తీసుకున్నాడు. కొంతకాలంగా ఆయన ఇతర హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మాత్రమే కనిపిస్తూ వచ్చాడు. సరైన కథ కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడని అభిమానులు కూడా అర్థం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ ప్రాజెక్టు మినహా మరే ప్రాజెక్టుకి సంబంధించి కూడా శర్వానంద్ పేరు వినిపించడం లేదు. మొదటి నుంచి కూడా శర్వానంద్ హడావిడిగా సినిమాలు చేస్తూ వెళ్లిన సందర్భాలు లేవుగానీ, ఈ సారి గ్యాప్ ఎక్కువగా వచ్చినందువలన, తప్పకుండా ఆయన స్పీడ్ పెంచవలసిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన లైన్లో పెట్టే ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది గనుక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular