తెరపై హీరోయిన్స్ గ్లామరస్ గా కనిపించాలి .. కొత్తగా అనిపించాలి. అందువలన ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ ను పరిచయం చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తుంటారు. ఈ కారణంగానే చకచకా హీరోయిన్స్ మారిపోతుంటారు. ఈ కారణంగానే వాళ్ల మధ్య పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది. టాలీవుడ్ విషయానికి వస్తే, ఇతర భాషల నుంచి కొత్త హీరోయిన్స్ ను రంగంలోకి దింపుతూనే ఉంటారు. అవసరమైతే నేరుగా మోడలింగ్ నుంచి పట్టుకొస్తుంటారు.
ఒక భాషలో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ కి, తమ కెరియర్ చాలా తక్కువ సమయం ఉంటుందనే విషయం అర్థమైపోతుంది. అందువలన ఇతర భాషా చిత్రాలపై కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. అలా కోలీవుడ్ నుంచి ఇక్కడికి వచ్చిన కథానాయికలు చాలామంది ఉంటారు. అలా వచ్చిన వారిలో టాప్ పొజీషన్ కి చేరుకుని చక్రం తిప్పినవారూ ఉన్నారు. ఇక అదే కోలీవుడ్ నుంచి మరో కొత్త కథానాయిక తెలుగు తెరపైకి రానుంది .. ఆ బ్యూటీ పేరే ‘ఐశ్వర్య మీనన్’.
2012లోనే ఆమె ఒక తమిళ సినిమాతో వెండితెరకి పరిచయమైంది. ఆ తరువాత మలయాళ … కన్నడ సినిమాలకు పరిచయమైనా, ఎక్కువగా ఫోకస్ చేసింది మాత్రం తమిళంలోనే. ఇక ‘స్పై’ సినిమాతో ఆమె తెలుగు తెరకి పరిచయం కానుంది. తెలుగులో నేరుగా ఆమె చేసిన ఫస్టు మూవీ ఇదే. నిఖిల్ హీరోగా చేస్తున్న ఈ సినిమా, నేతాజీ సుభాశ్ చంద్రబోస్ అదృశ్యం నేపథ్యంలో నడుస్తుంది. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమా ఈ బ్యూటీకి ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి.