Wednesday, June 17, 2026
HomeసినిమాVijay-Samantha: 'ఖుషి' విషయంలో ఇది బ్యాలెన్స్ చేయడం సాహసమే!

Vijay-Samantha: ‘ఖుషి’ విషయంలో ఇది బ్యాలెన్స్ చేయడం సాహసమే!

‘ఖుషి’ అనే టైటిల్ కి ఒక క్రేజ్ ఉంది. పవన్ కల్యాణ్ కెరియర్ లో చెప్పుకోదగినదిగా ఈ టైటిల్ తో వచ్చిన సినిమా కనిపిస్తుంది. ఆ సినిమా ప్రేమకథా చిత్రాల్లో ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా కూడా ప్రేమకథ ప్రధానంగా రూపొందుతున్నదే. అందువలన సహజంగానే ఈ టైటిల్ పై ఆసక్తి .. అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ – సమంత జంటగా నటించిన ఈ సినిమా నుంచి నిన్ననే ఒక మెలోడీని వదిలారు.

ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘నిన్నుకోరి’ .. ‘మజిలీ’ వంటి ప్రేమకథా చిత్రాలతో హిట్స్ అందుకున్న దర్శకుడిగా ఆయనకి మంచి క్రేజ్ ఉంది. ఈ సారి కూడా లవ్ స్టోరీతోనే  వస్తుండటం  వలన పాజిటివ్ బజ్ కనిపిస్తోంది. ఆయన దర్శకత్వంలో సమంతకి ఇది రెండో సినిమా. ఇక గతంలో ఆమె విజయ్ దేవరకొండ జోడీగా ‘మహానటి’లో కనిపించింది. కాకపోతే ఆ కథ జరిగే కాలం వేరే కావడం … ప్రధానమైన కథ వేరే ఉండటం వలన ఈ జంట నామ మాత్రంగానే కనిపిస్తుంది.

ఇక ‘ఖుషి’ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ – సమంత హీరో హీరోయిన్స్. ఈ ఇద్దరి మధ్యనే ఫీల్ తో కూడిన ప్రేమకథ నడుస్తుందనే విషయం అప్ డేట్స్ వలన అర్థమవుతోంది. అయితే కెరియర్ పరంగా చూసుకుంటే విజయ్ దేవరకొండ కంటే సమంత చాలా సీనియర్. లవ్ స్టోరీస్ ను చేసే స్థాయిని ఆమె దాటిపోయింది. అలాంటి సమంతతో విజయ్ దేవరకొండ లవ్ స్టోరీని నడిపించడం కొంచెం రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే. మరి శివ నిర్వాణ ఈ కథను ఎలా రాసుకున్నాడో .. జూనియర్ .. సీనియర్ ల మధ్య ట్రాక్ ను ఎలా బ్యాలెన్స్ చేయనున్నాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular