Friday, September 20, 2024
HomeTrending NewsMaharastra: విదర్భలో పుంజుకుంటున్న బిఆర్ ఎస్

Maharastra: విదర్భలో పుంజుకుంటున్న బిఆర్ ఎస్

మహారాష్ట్ర నుండి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీలోకి బుధవారం కూడా చేరికలు కొనసాగాయి. బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు రాజకీయ నేతలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి హైద్రాబాద్ లో అధినేత గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యంగా విదర్భ ప్రాంత నేతలు బిఆర్ ఎస్ లో చేరేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. విదర్భ ప్రాంతంలో రాబోయే ఎన్నికల్లో ప్రధాన పార్టీల గెలుపు ఓటములను గులాబీ పార్టీ తారు మారు చేసే ప్రమాదం ఉందని మహారాష్ట్ర ప్రధాన పార్టీల నేతలు అంటున్నారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన వారి వివరాలు :
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రాజకీయ నేత అన్నాబావు సాఠే మనవడు సచిన్ సాఠే, వైంటీ వైభవ్ కదం (మాజీ ZP సభ్యుడు), ప్రమోద్ విఠల్ జాదవ్(మాజీ ZP సభ్యుడు, సిర్వాల్ సతారా), మేనేష్ రాహుల్ గాడ్సే (P.S సభ్యుడు), అజర్ ఖాన్ (మాజీ ఇండియన్ ఎయిర్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్), వభూ వసంతరావు కదం (ఇండియన్ ఎయిర్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్, రీజినల్ కార్యదర్శి) శ్రీనివాస్ ఇస్తారి ఎలిగేటి (మాజీ కార్పొరేటర్ భివండి) రామదాస్ ఘరత్ (ZP సభ్యుడు, శివసేన ఠాక్రే నుంచి 2024 లో ఎమ్మెల్యే అభ్యర్థి), శంకర్ గాడ్సే, శంభురాజే ధావలే, జయ బాలకృష్ణ పవార్ (మాజీ సర్పంచ్),వినోద్ మోటే గెవ్నాయ్ (NCP ఓరియేటర్ సెల్ ప్రెసిడెంట్ నాగ్పూర్), డాక్టర్ అస్లాం బారీ అధ్యక్షుడు యునైటెడ్ ముస్లిం ఫోరమ్ విధర్భ, మౌలానా జునైద్ ఖాస్మీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు హింగోలి, మౌలానా ఖాస్మీ అబ్దుల్ లతీఫ్, జమియత్ ఉల్మా ఇ హింద్ మహా అధ్యక్షుడు నాందేడ్ ఏఐఎంఐఎం, మౌలానా షఫీయుల్లా సాహబ్, మాలెగావ్ మహారాష్ట్ర, మౌలానా అబూబకర్ సాహబ్ (ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), మహేష్ టెలీ పాటిల్, హనుమంతరావు మోతె,. దిలీప్ రావు గైక్వాడ్, సంతోష్ సుర్తే, సుభాష్ టెలీ పాటిల్, ఓంకార్ ఎర్కార్, దీపక్ తాంబే, రామ్ రఘునాథ్ చాటే (మాజీ పంచాయతీ సమితి చైర్మన్), శత్రుగన్ తాప్సే, (షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్), అనుసయ బిక్కడ్ బిజెపి యువమోర్చా, శ్రీకృష్ణ చాటే, వసంత్ చాటే, కేశవ్ ప్యాడ్, యోగేష్ సక్రే (జిల్లా యువత ఉపాధ్యక్షుడు), రామేశ్వర్ లగాస్కర్, శ్రీకాంత్ కమ్లే, కపిల్ ధావద్, రాజ్ భీమ్‌రావ్ పాటిల్ (సర్పంచ్ యూనియన్ అధ్యక్షుడు), అశోక్ నిప్టే, ఓం ప్రకాశ్ సబే, హనుమంత్ మాత్రే, వైభవ్ శెట్టి (టీచర్స్ అసోసియేషన్), సాంబాజీ మాస్కే(
సమతా పార్టీ), మహేష్ ధోలారే (భీమ్ ఆర్మీ సేన), చంద్రశేఖర్ ఘడ్గే (సంభాజీ బెగ్రేడ్), నీలేష్ కాంబ్లే, సందీప్ ముగ్సే, శివాజీ పవార్,సాజిద్ సయ్యద్, నవనాథ్ జాదవ్ (కామ్‌గర్ అఘడి), నీలం సునీల్ పోక్లే, (రాష్ట్రవాది కాంగ్రెస్ పతోడా, మహిళా ప్రెసిడెంట్,బీడ్ ), శివ బావు గైక్వాడ్ ( ఆర్ పి ఐ జిల్లా అధ్యక్షుడు – షోలాపూర్), గణేష్జీ భగత్, మలుజిరాజే వాఘ్మరే, వాడేకర్ స్వప్నిల్, కిషోర్ తరస్కర్, అన్నాసాహెబ్ జాదవ్, సంజయ్ దేశ్ముక్, సయ్యద్ రియాజ్, సయ్యద్ ఇనాయత్ అలీ, చౌదరి సంతోష్(పోలీస్ ఫ్రెండ్ సర్కిల్),శుక్లా అవదేశ్..
సునీల్ లహానే (జెడ్పీ సభ్యుడు వాషిమ్), క్రుష్ణ గైక్వార్డ్ (స్వాభిమాని మంచ్), జాఫర్ షేక్ (స్వాభిమాని జిల్లా అధ్యక్షుడు), సంజయ్ షిండే (ప్రహార్ పార్టీ), అశోక్ గైక్వార్డ్ (షిర్డీ), అవినాష్ థాంబ్రే (శివసేన పార్లమెంట్ సమన్వయకర్త), ప్రతీక్ అశోక్ వంకర్ (జిల్లా కార్యదర్శి యవత్మాల్), రాజవిందర్ కౌర్ షెర్గిల్ (ఆల్ ఇండియా మీడియా సురక్ష ఫోరమ్), దయానంద్ గౌతమ్ నరంజే (కాంగ్రెస్ కమిటీ రాలేగావ్), జాన్ మంత్రి (సామాజిక కార్యకర్త), ప్రియా నాగదేవత (చంద్రపూర్)….తదితరులు సిఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా… ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, బిఆర్ఎస్ సీనియర్ నేత రాష్ట్ర సివిల్ సప్లయీస్ చైర్మన్ రవీందర్ సింగ్, మహారాష్ట్ర బిఆర్ఎస్ నేతలు మాణిక్ కదమ్, శంకరన్న డోంగే, బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారి తదితరులున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్