Saturday, June 13, 2026
HomeTrending NewsChandrababu: నష్టపరిహారం ఎక్కడ?: బాబు

Chandrababu: నష్టపరిహారం ఎక్కడ?: బాబు

అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట వివరాలను ప్రభుత్వం ఎందుకు వెల్లడించడంలేదని  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

“రాష్ట్రంలో నేటి అన్నదాతల ఆక్రందన..రేపు పెను ఉప్పెన అవుతుంది. ఆ ఉప్పెనలో ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం కొట్టుకుపోతుంది. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు? దెబ్బతిన్న పంటల వివరాలు ఇప్పటికీ ఎందుకు వెల్లడించడం లేదు?

రబీకి పంటల బీమా ప్రీమియం విషయంలో వాస్తవాలు దాచి పెట్టడానికి కారణాలు ఏంటి? అకాల వర్షాలకు అన్నదాతకు జరిగిన నష్టానికి ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం ఎక్కడ? దెబ్బతిన్న పంట ఎంత…కొన్న ధాన్యం ఎంత?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతును ఆదుకోడానికి రాకెట్ సైన్స్ చదవాలా అన్న జగన్, ఇప్పుడు ఎక్కడ ముడుచుకుని కూర్చున్నాడు? 15 జిల్లాల్లో పంట నష్టం జరిగితే ఒక్క రైతు దగ్గరకు కూడా ఈ ముఖ్యమంత్రి ఎందుకు వెళ్లలేదు?

మా రైతన్నల పంట మునిగింది…పరిహారం ఇవ్వండి!” అంటూ స్పందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular