Sunday, November 24, 2024
HomeTrending NewsCM Kavali Tour: దశాబ్దాల సమస్యకు చరమగీతం

CM Kavali Tour: దశాబ్దాల సమస్యకు చరమగీతం

రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కును అందించే కార్యక్రమాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో నేడు శుక్రవారం ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీని ద్వారా దశాబ్దాల సమస్యకు చరమగీతం పాడుతూ..చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం లభించి  రైతన్నలకు  సర్వ హక్కులూ లభిస్తాయి.

బ్రిటీష్‌ వారి కాలంలో సుమారు వంద సంవత్సరాల క్రితం భూసర్వే జరిగినప్పుడు ‘ప్రభుత్వ భూమి‘ లేదా ‘ప్రైవేటు భూమి‘ అని నిర్ధారణ చేయని కారణంగా రెవెన్యూ రికార్డులలో (రీ సెటిల్మెంట్‌ రిజిస్టర్‌ ఆర్‌ఎస్‌ఆర్‌) పట్టాదారు గడిలో ‘చుక్కలు‘ పెట్టి వదిలేశారు. సదరు భూములే ‘చుక్కల భూములు‘.. దీని వల్ల సంపూర్ణ హక్కులు లేక దశాబ్దాలుగా రైతులు ఆ భూములు అనుభవిస్తున్నా వాటిని అమ్ముకునే స్వేచ్ఛ లేక, సర్వ హక్కులు లేక ఇబ్బంది పడుతున్న దుస్థితి నెలకొని ఉంది. దీనికి అదనంగా రైతులకు మరింత ఇబ్బంది కలిగేలా 2016లో ఈ భూములన్నీ ఒక్క కలం పోటుతో నిషేధిత భూముల జాబితాలో చేర్చడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది..

ఈ పరిస్థితిని సమూలంగా మారుస్తూ ప్రతి రైతన్న కుటుంబానికి మేలు జరగాలని, వారి ఆస్థిపై పూర్తి హక్కులు వారికే చెందాలని రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ రైతన్నలు తిరిగే అవసరం లేకుండా, వారికి ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా దశాబ్దాల కాలం నాటి ఈ చుక్కల భూముల సమస్యలకు సిఎం జగన్  పరిస్కారం చూపించారు.   సంవత్సరాల తరబడి తమ స్వాధీనంలో ఉండి కూడా ఏ అవసరాలకు (క్రయవిక్రయాలు, రుణం, తనఖా, వారసత్వం, బహుమతి మొదలగు) వాడుకోలేని దుస్థితి నుంచి వారి వారి భూములకు వారిని పూర్తి హక్కుదారులను చేసి నేడు సుమారు 97,471 కుటుంబాలకు 2,06,171 ఎకరాల భూమి..దాదాపు రూ. 20,000 కోట్ల మేర లబ్ది చేకూర్చినట్లు అవుతుంది.

జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా జిల్లా అవనిగడ్డ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే సుమారు 22,000 మంది పేద రైతన్నలకు మేలు జరిగేలా నిషేధిత భూముల జాబితా నుండి సుమారు 35,000 ఎకరాల ‘‘షరతులు గల పట్టా భూముల‘ తొలగించి రైతులకు న్యాయం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్