Saturday, September 21, 2024
Homeసినిమా#SS4: సుడిగాలి సుధీర్ కొత్త సినిమా ప్రారంభం

#SS4: సుడిగాలి సుధీర్ కొత్త సినిమా ప్రారంభం

సుడిగాలి సుధీర్ , దివ్య భారతి హీరోహీరోయిన్లుగా ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న చిత్రం #SS4.  చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ, బెక్కం వేణుగోపాల్ నిర్మాతలుగా, లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ నేడు ప్రారంభమైంది.  ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, కె.ఎస్ రామారావు, సూర్యదేవర రాధాకృష్ణ, కెఎల్‌ దామోదర ప్రసాద్‍ ఈ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చదలవాడ శ్రీనివాస్ క్లాప్ కొట్టగా జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

నిర్మాత చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ “ఈ సినిమా స్క్రిప్ట్ ఒన్ ఇయర్ క్రితమే ఫైనల్ అయిపోయింది. 4, 5 మంత్స్ నుండి ప్రీ ప్రొడక్షన్ వర్క్ గట్టిగా చేసాం. ఈ సినిమాకు సంబంధించి కర్త కర్మ, క్రియ బెక్కం వేణుగోపాల్ గారే. ఈ సినిమాకు లియో మ్యూజిక్ అందిస్తున్నాడు. మా సినిమాను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు నరేష్ కుప్పిలి మాట్లాడుతూ “సుధీర్ గారికి ఈ కథను ఒక గంట నేరేట్ చేయగానే ఆయనకు బాగా నచ్చి ఒప్పుకున్నారు.మా ప్రొడ్యూసర్స్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్ని చేసి పెట్టారు. లియో మాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా రైటర్  ఫణికి థాంక్యూ. అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని అనుకుంటున్నాను” అన్నారు.

హీరో సుధీర్ మాట్లాడుతూ “ఇక్కడికి వచ్చిన అందరికి థాంక్యూ. నన్ను ప్రేక్షకులు ఇంతగా ఆదరించడానికి కారణం మీడియానే. టీం అందరి గురించి ఇది వరకే చెప్పారు. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. ఈ మూవీకి సంబంధించిన ఇంకొన్ని విషయాలను త్వరలో చెబుతాను” అని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్