Thursday, June 18, 2026
HomeTrending NewsSorghum: జొన్న పంటకు మద్దతు ధర

Sorghum: జొన్న పంటకు మద్దతు ధర

రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్ ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ, 2022-23 యాసంగి సీజన్లో పండించిన జొన్న(హైబ్రిడ్) పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మార్క్ ఫెడ్ ఎండి చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
యాసంగి సీజన్లో పండిన మొత్తం 65,494 మెట్రిక్ టన్నుల జొన్న పంటను కొనుగోలు చేసేందుకు కావాల్సిన రూ. 219. 92 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటి ఇవ్వనున్నది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామరెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల పరిథిలో జొన్న పంటను పండించిన దాదాపు వొక లక్షమంది రైతులకు సిఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ద్వారా లబ్ది చేకూరనున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular