Sunday, March 15, 2026
HomeసినిమాPushpa Mania: డ్రీమ్ గర్ల్ మనసు దోచుకున్న పుష్ప రాజ్

Pushpa Mania: డ్రీమ్ గర్ల్ మనసు దోచుకున్న పుష్ప రాజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని మనసు  దోచుకున్నారు. పుష్ప సినిమాతో బన్నీ క్రేజ్ అమాంతం పెరిగింది. మన దేశంలోనే కాదు విదేశాల్లో సైతం పుష్ప మానియా కనిపించింది. దీంతో పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన పుష్ప 2 గ్లింప్స్ 100 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకెళుతుంది. దీనిని బట్టి పుష్ప 2 కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతోంది.

తాజాగా బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించారు.  పుష్ప సినిమా తనకు చాలా నచ్చిందని… పుష్పగా అల్లు అర్జున్ లుక్ చూసి ఆశ్చర్య పోయానని అన్నారు. గత సినిమాల్లో చాలా స్టైల్ గా,  అందంగా కనిపించిన అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం అంతగా మారడం చూసి ఆశ్చర్యపోయానని అన్నారామె. అందంగా స్టైల్ గా ఉన్న సినిమాల్లోనే కాకుండా లుంగీ కట్టి మాస్ లుక్ లో కనిపించినా కూడా అల్లు అర్జున్ నచ్చాడు అని చెప్పారు. అంతే కాకుండా..  బన్నీ ఎలా ఉన్నా కూడా హీరోలాగే ఉన్నాడు అంటూ డ్రీమ్ గర్ల్ హేమామాలిని కామెంట్ చేయడం విశేషం. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పుష్ప 2 చిత్రం 1000 కోట్ల టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో నిర్మిస్తుంది.  రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆడియో కూడా అంతకు మించి అనేలా ఉంటుందట. మరి… పుష్ప రాజ్ ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular