Friday, September 20, 2024
Homeసినిమా#BoyapatiRAPO ఫస్ట్ థండర్ కి ముహుర్తం ఫిక్స్

#BoyapatiRAPO ఫస్ట్ థండర్ కి ముహుర్తం ఫిక్స్

హీరో రామ్, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటుంది. అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలు, అత్యన్నత సాంకేతిక ప్రమాణాలతో, హ్యుజ్ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.  జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ థండర్ ను రామ్ పుట్టినరోజు అయిన మే 15 న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

మే 15 ఉదయం 11 గంటల25 నిమిషాలకు ముహూర్తంగా ఖరారు చేశారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రామ్ డాషింగ్, డైనమిక్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో మాసీవ్ క్యారెక్టర్‌లో నటించేందుకు రామ్ బీస్ట్ లుక్‌లో కనిపించారు. హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రామ్ కు జోడిగా నటిస్తోంది. ఇందులో ప్రముఖ పాత్రలలో కొంతమంది ప్రముఖ నటులు నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎడిటింగ్‌ను తమ్మురాజు నిర్వహిస్తుండగా, సంతోష్ డిటాకే సినిమాటోగ్రఫీ ఆదిస్తున్నారు. #BoyapatiRAPO దసరా కానుకగా అక్టోబర్ 20న హిందీ, అన్ని దక్షిణ భారత భాషల్లో విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్