Saturday, June 13, 2026
Homeసినిమాజూన్ 3న హీరో శర్వానంద్‌, రక్షితల వివాహం

జూన్ 3న హీరో శర్వానంద్‌, రక్షితల వివాహం

హీరో శర్వానంద్‌, రక్షితల వివాహం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగనుంది. ఈ  వేడుక రెండు రోజులు పాటు వైభవంగా జరగనుంది. మెహందీ ఫంక్షన్ జూన్ 2 న జరుగుతుంది. మరుసటి రోజు పెళ్లి కొడుకు ఫంక్షన్ జరుగుతుంది. అదే రోజు జూన్ 3న జైపుర్‌లోని లీలా ప్యాలెస్‌ లో వివాహ వేడుక రాత్రి 11 నుండి ప్రారంభమవుతుంది.

శర్వానంద్‌, రక్షితల నిశ్చితార్థం జనవరిలో జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో ఇరు కుటుంబసభ్యులు, ప్రముఖుల సమక్షంలో వీళ్లిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ప్రీవెడ్డింగ్, వెడ్డింగ్ వేడుకలు అంగరంగవైభవంగా కన్నుల పండగగా జరగనున్నాయి.ఈ రోజు నుంచే పెళ్లి కార్యక్రమాలు మొదలైనట్టు తెలుస్తోంది. వివాహ వేడుకకు శర్వాకు చిన్ననాటి మిత్రుడైన రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో పాటు ఇతర సినీ ప్రముఖులు హాజరవుతారని  సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular