ప్రభాస్ నటించిన భారీ, క్రేజీ మూవీ ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ ఈ సినిమాను రామాయణం ఆధారంగా రూపొందించారు. ఇటీవల రిలీజ్ చేసిన ఆదిపురుష్ ట్రైలర్ కు అనూహ్య స్పందన లభించింది. దీంతో మూవీ పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 16న ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు మేకర్స్.
అయితే.. మూడు రోజుల ముందే అనగా జూన్ 13న ట్రిబెకా ఫిలిం షెస్టివల్ లో ఈ మూవీ ప్రీమియర్లు వేయాలనుకున్నారు. ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించే అన్ని సినిమాల కంటే దీనికే టిక్కెట్లు ముందుస్తుగా అమ్ముడుపోయాయి. ఇప్పుడు ఈ ప్రీమియర్లను క్యాన్సిల్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త అభిమానుల్లో టెన్షన్ క్రియేట్ చేస్తుంది. అంతే కాకుండా యు.ఎస్ లో ఇండియాలో కంటే ముందుగా వేసే షోలను కూడా నిర్మాతలు క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నారట. దీనికి సంబంధించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సివుంది.
ఇలా ఎందుకు చేయాలి అనుకుంటున్నారంటే.. టీజర్ రిలీజ్ చేసినప్పుడు గ్రాఫిక్స్ సరిగా లేవంటూ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఒకవేళ సినిమాకి డివైడ్ టాక్ వస్తే.. ఆ ప్రభావం మార్నింగ్ షోల పై పడుతుంది. అందుచేత ఇలా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. నిజానికి ట్రైలర్ చూసిన తర్వాత ఆదిపురుష్ పై పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ ట్రైలర్ తక్కువ టైమ్ లోనే 100 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఈవిధంగా ఈ సినిమాపై నెగిటివిటీ తగ్గిందని చెప్పచ్చు. అయినప్పటికీ.. మేకర్స్ రిస్క్ వద్దనుకుని.. ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్ రావాలని ఇలా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకరకంగా ఇలా చేయడం మంచిదే. మరి.. ఏం జరగనుందో చూడాలి.