Sunday, November 24, 2024
HomeTrending NewsTS Cabinet: సిఎం కెసిఆర్ ఎన్నికల వరాలు

TS Cabinet: సిఎం కెసిఆర్ ఎన్నికల వరాలు

రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడతుండటంతో ముఖ్యమంత్రి కెసిఆర్ వివిధ వర్గాలకు వరాలు ప్రకటించారు.  దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 21 రోజుల పాటు అన్ని నియోజక వర్గాల్లో సంబరాలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. కులవృత్తుల వారి అభివృద్ధి కోసం మంత్రి గంగుల, ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయం, విధివిధానాలు రూపొందించే బాధ్యత అప్పగించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించేలా ప్లాన్ చేయాలని, 111 జీఓ పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం, 84 గ్రామాల ప్రజలు ఎంతో విజ్ఞప్తి చేస్తున్నారు. ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకున్నారు. HMDA భూముల వలే, ఈ గ్రామాలకు కూడా అవే రూల్స్ ఉంటాయి. హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు. వీటితో పాటు మూసిని కాళేశ్వరం జలాలతో లింక్ చేయాలని నిర్ణయం. ఆరోగ్య శాఖలో రి ఆర్గనైజిగ్ , 33 జిల్లాలో DMHO పోస్టుల శాంక్షన్. హైదరాబాద్ జనాభాకు మరింత వైద్య సేవలు అందేలా GHMC 6 జోన్లకు అనుగుణంగా 6 DMHO లు

రాష్ట్రంలో మొత్తం 38 DMHO పని చేస్తారు. 40 మండలాల్లో కొత్త PHC మంజూరు చేయాలని నిర్ణయం. అర్బన్ PHC లలో ఇప్పటి వరకు కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. పర్మినెంట్ గా ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయం. వ్యవసాయ రంగంలో మార్పుల కోసం వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ. వడగళ్ల వాన వల్ల ఎంతో నష్ట పోయాం, పంట కాలం నెల ముందుకి జరపాలని ప్రణాళిక. నాడు 10 జిల్లాలో 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలే. నేడు దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది అంటే, దానికి సీఎం కేసీఆర్ నిర్ణయాలు కారణం. అకాల వర్షాల వల్ల నష్టపోవడం వద్దు అని నెల ముందు పంట జరపాలని యోచన. ఎలా ముందుకు తేవాలి అనే దానిపై సబ్ కమిటీ నివేదిక ఇస్తుంది.

నకిలీ విత్తనాలు విషయంలో సీరియస్, కటినంగా వ్యవహరించాలని నిర్ణయం. ఎలాంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని, అరెస్ట్ చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు, ఒక్క రైతు కూడా మోసపోవద్దు. దీనిపై కూడా సబ్ కమిటీ పని చేస్తుంది. మక్కలు, జొన్నలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం తరుపున గ్యారెంటీ ఇస్తూ నిర్ణయం. అచ్చం పేట ఉమా మహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ఫేస్ 1, ఫేస్ 2 మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. VRA లు అందరూ రెగ్యులారైజ్ చేయాలని నిర్ణయం. విధివిధానాలు ఖరారు చేయాలని ccla నవీన్ మిట్టల్ కు ఆదేశాలు జారీ చేశారు. రెండో విడత గొర్రెల పంపిణీ 15 రోజుల్లో ప్రారంభించాలని, వనపర్తి జర్నలిస్టు అసోసియేశన్ కు 10 గంటల స్థలం కేటాయింపు. ఖమ్మం లో జర్నలిస్టుల ఇళ్ల కోసం 23 ఎకరాలు స్థలం కేటాయింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మైనార్టీ కమిషన్ లో జైన్ కమ్యూనిటీ యాడ్ చేస్తూ నిర్ణయం, కమిషన్ సభ్యులుగా ఒకరికి అవకాశం ఇవ్వాలని, TSPSC లో 10 పోస్టుల మంజూరు చేశారు.

విఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా వారికి రెగ్యులర్ స్కేల్ వచ్చే విధంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల లోపు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఈ విషయం పై కేబినేట్ లో నిర్ణయం తీసుకున్న అనంతరం విఆర్ఏ జెఎసి ప్రతినిధులను తన ఛాంబర్ కు ఆహ్వానించి సీఎం వారితో చర్చించారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసేదే పేద ప్రజల కోసమని, చిరుద్యోగులైన విఆర్ఏల సమస్యలను మానవత్వంతో వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నదని సీఎం పేర్కొన్నారు. సుమారు 20 వేల మంది ఉన్న విఆర్ఏ లలో ముందుగా మెడికల్ ఇన్ వ్యాలిడేషన్ ప్రకారం అర్హులై దరఖాస్తున్న చేసుకున్న వారి వారసుల వివరాలు, వారి విద్యార్హతలు సేకరించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. మిగతావారిని వారి అర్హతల ఆధారంగా మున్సిపల్, ఇరిగేషన్ (లష్కర్స్), రెవెన్యూ, జెడ్ పి, ఎడ్యుకేషన్, మెడికల్ కాలేజీలు, మిషన్ భగీరథ తదితర అవసరమైన శాఖల్లో స్కేల్ ఇస్తూ, తదుపరి ప్రమోషన్ వచ్చే విధంగా వారిని సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిట్టల్ ను ఆదేశించారు. ఈ విషయంలో వీఆర్ఏ లు సమాచారం ఇవ్వడం సహా, అన్ని విషయాల్లో సమన్వయం చేయాలని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డికి సూచించారు. ముందుగా మొత్తం సమాచారాన్ని అధికారులకు అందజేయాలని, విఆర్ఏ జెఎసి ప్రతినిధులకు సూచించారు. విఆర్ఏలలో వారి విద్యార్హతలను బట్టి వారికి నచ్చిన ప్రభుత్వ శాఖలను ఎంచుకునే అవకాశం ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్