Wednesday, June 17, 2026
HomeసినిమాNTR-ANR: నందమూరి, అక్కినేని ఫ్యామిలీల మధ్య విబేధాలు లేనట్టేనా?

NTR-ANR: నందమూరి, అక్కినేని ఫ్యామిలీల మధ్య విబేధాలు లేనట్టేనా?

నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు.. వీరిద్దరి మధ్య నువ్వా..? నేనా.? అనే పోటీ ఉన్నప్పటికీ మంచి స్నేహం ఉండేది. ఆ కారణంగానే వీరిద్దరూ కలిసి ఓ పాతిక సినిమాల్లో కలిసి నటించారు. అయితే.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని.. ఆ కారణంగానే గ్యాప్ వచ్చిందని.. అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తరంలో బాలకృష్ణ, నాగార్జున మధ్య కెరీర్ ప్రారంభంలో మంచి స్నేహం ఉండేది. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది.

మూడవ తరంలో నాగచైతన్య, అఖిల్, జూనీయర్ ఎన్టీఆర్ మధ్య మంచి అనుబంధమే ఉంది. అయితే… ఇటీవల బాలకృష్ణ ఓ వేడుకలో మాట్లాడుతూ.. అక్కినేని-తొక్కినేని అంటూ మాట్లాడడంపై విమర్శలలొచ్చాయి.  నాగచైతన్య, అఖిల్ కూడా దీనిపై స్పందించి బాలయ్య వ్యాఖ్యలను ఖండించారు.  దీంతో ఈ రెండు కుటుంబాలమధ్య విభేదాలు మరోసారి బైట పడ్డాయి.  బాలయ్య తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి.

ఇదిలా ఉంటే.. ఈ వివాదం నేపధ్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎవరూ హాజరుకారేమో అనుకున్నారు కానీ.. నాగచైతన్య, సుమంత్ హాజరయ్యారు. బాలయ్యను నాగచైతన్య సింపుల్ గానే పలకరించారు కానీ.. చంద్రబాబు నాయుడుతో మాత్రం చైతన్య ఎంతో ఆప్యాయతతో మాట్లాడారు. అలాగే లెజెండరీ యాక్టర్ ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. బాలకృష్ణ.. అక్కినేని కుటుంబ సభ్యులను ఆహ్వానించడం గొప్ప విషయం అనుకుంటే నాగ చైతన్య ఎన్టీఆర్ ఘనత గురించి గొప్పగా మాట్లాడి ఆకర్షించాడు. దీంతో నందమూరి- అక్కినేని కుటుంబాల మధ్య విభేధాలు సమసిపోయాయి అనుకోవచ్చా..? నాగార్జున రాలేదు కాబట్టి ఇంకా ఆ విభేదాలు అలాగే ఉన్నాయా..? అనేది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular