Saturday, November 23, 2024
HomeTrending Newsప్రజల కష్టాలే తెరాస అజెండా

ప్రజల కష్టాలే తెరాస అజెండా

ప్రతీ పేదవాడి కడుపు నింపడమే‌ కేసీఆర్ లక్ష్యమని, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇలా 90.5 శాతం ప్రజలకు బియ్యం ఇస్తున్నారా అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. కొందరు బీజేపీ నేతలు కళ్యాణలక్ష్మి పథకాన్ని పరిగె ఎరుకోవడంతో పోల్చారని మండిపడ్డారు. గజ్వేల్ లోని మహతీ ఆడిటోరియం లో కొత్త రేషన్ కార్డులు, కళ్యాణ‌ లక్ష్మి  చెక్కులను ఆర్థిక మంత్రి హరీశ్ రావు లబ్దిదారులకు పంపిణి చేశారు. కళ్యాణ లక్ష్మి పథకం వద్దని బీజేపీ నేతలు చెబుతున్నారు, బీజేపీ పాలిత 16 రాష్ట్రాల్లో ఇలా పేదింటి ఆడపిల్ల పెళ్లికి సాయం అందిస్తున్నారా అని అడిగారు.

తెరాస ఎన్నికల కోసమే పనులు‌చేస్తుందని కొందరు విమర్శలు చేస్తున్నారని, తెరాస తెలంగాణ కోసం, ప్రజల కోసం పని చేసే పార్టీ అని మంత్రి వెల్లడించారు. ప్రజలు తెలివైన వారు, అంతిమంగా పని చేసే వాళ్లకే తమ మద్ధతిస్తారు. ప్రజల‌ కష్ట్టాలే మా ఎజెండా అన్నారు. రాష్ట్ర జనాభాలో 90.5  శాతం మంది ప్రజలకు ప్రభుత్వం రేషన్ బియ్యం అందిస్తోంది. ప్రతినెల దాదాపు 231 కోట్లతో సంవత్సరానికి 2766 కోట్ల రూపాయల్ని ప్రజాపంపిణీ కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోందని మంత్రి వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్