Saturday, November 23, 2024
HomeTrending NewsTDP Manifesto: ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ : చంద్రబాబు

TDP Manifesto: ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ : చంద్రబాబు

మహిళలు, రైతులు, యువత, బిసిలకు మేలు చేకూర్చేలా ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో తెలుగుదేశం పార్టీ తొలివిడత ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు  ప్రకటించారు. ఈ మేనిఫెస్టో అనే ఆయుధం కార్యకర్తల చేతికి ఇస్తున్నామని వారు దీనితో ప్రజా క్షేత్రంలో యుద్ధం చేసి పార్టీని గెలిపించాలని కోరారు. రాజమండ్రిలో మహానాడు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో బాబు ఈ ఎన్నికల వరాల జల్లు కురిపించారు. మొత్తం ఆరు అంశాలు నేటి మేనిఫెస్టోలో పొందుపరిచారు. రాబోయే ఐదేళ్ళలో ప్రజలు ఊహించని విధంగా పనిచేసి రాష్ట్రాన్ని గాడిలో పెడతనని బాబు వ్యాఖ్యానించారు. దసరా సమయానికి పూర్తి మేనిఫెస్టో ప్రకటిస్తామని తెలిపారు.

మహిళల కోసం మహా శక్తి:

  • 18-59 సంవత్సరాల మహిళలకు ‘ఆడ బిడ్డ నిధి’ కింద నేరుగా 1500 రూపాయలు అకౌట్లలో జమ, ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికీ వర్తింపు
  • తల్లికి వందనం: ఒక్కో బిడ్డకూ ఏటా 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తాం
  • స్థానిక సంస్థల్లో పోటీకి ఇప్పటివరకూ ఉన్న ‘పిల్లల నిబంధన’ ఎట్టివేస్తాం. ఎంతమంది పిల్లలున్నా పోటీ చేసేలా చట్టంలో మార్పులు చేస్తాం
  • సంవత్సరానికి ఉచితంగా మూడు సిలిండర్లు
  • ఆడబిడ్డలు జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణం

యువకుల కోసం యువ గళం:

  • రాబోయే ఐదేళ్ళలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత తీసుకుంటాం
  • యువ గళం నిధి కింద యువతకు ఉద్యోగంవచ్చేవరకూ నెలకు 3  వేల రూపాయల నిరుద్యోగ భ్రుతి

రైతుల కోసం అన్న దాత:

  • రైతుకు సంవత్సరానికి 20 వేల రూపాయల పెట్టుబడి సాయం
  • వ్యవసాయం లాభసాటిగా చేయడం కోసం, రైతు ఆత్మగౌరవంతో బతకడం కోసం ఏం చేయాలో అన్నీ చేస్తాం

ఇంటింటికీ నీరు

  • ఇంటింటికీ ఉచితంగా సాగునీరు అందిస్తాం

బిసిలకు రక్షణ చట్టం:

  • బిసిల రక్షణ కోసం ప్రత్యేక చట్టం
  • బిసిలలోని కులాల కోసం ఏం చేయాలో అలోచించి మేనిఫెస్టోలో పెడతాం

పూర్ టూ రిచ్:

  • పేదలను ధనికులుగా చేసే బాధ్యత తీసుకుంటాం (పేదలను సంపన్నులను చేస్తాం)
  • బిసిలలోని కులాల కోసం ఏం చేయాలో అలోచించి మేనిఫెస్టోలో పెడతాం

అంటూ బాబు టిడిపి మేనిఫెస్టో తొలి దశను ప్రకటించారు

జగన్ చెబుతున్నట్లు రాష్ట్రంలో జరుగుతున్నది క్లాస్ వార్ కాదని, క్యాష్ వార్ జరుగుతోందని బాబు ఆరోపించారు. అవినీతిపరుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించి వారు సంపాదించింది కక్కించి ఆ సొమ్మును పేదల కోసం ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. ‘అందరి లెక్కలు తేలుస్తా- అవినీతి సొమ్ము కక్కిస్తా’ అంటూ హెచ్చరించారు. వైసీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని, మహానాడు పెట్టుకుంటే పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. జగన్ దోచుకోవడం గురించి, రౌడీయిజం గురించి ఆలోచిస్తుంటే… తాము రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నామని చెప్పారు. వారిది ధనబలం- మాది ప్రజా బలం… వారిది ప్రిజన్ పాలిటిక్స్- మాది విజన్ పాలిటిక్స్ అంటూ అభివర్ణించారు. వచ్చేఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామం అని.. ఈ పోరాటానికి సిద్ధంగా ఉండాలని బాబు కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్