Saturday, November 23, 2024
HomeTrending NewsAmbati: ప్రజల నెత్తిన వాగ్ధానాల టోపీ: రాంబాబు

Ambati: ప్రజల నెత్తిన వాగ్ధానాల టోపీ: రాంబాబు

నలభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ పద్నాలుగేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఇచ్చిన హామీలు అమలు చేసిన చరిత్ర జన్మ మొత్తంలో ఉందా అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, కోటయ్య పేరుతో నిబంధనలు పెట్టి, మోసం చేసిన సంగతి నిజం కాదా అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాంబాబు మీడియాతో  మాట్లాడారు. ‘భవిష్యత్ కు గ్యారంటీ’ పేరిట చంద్రబాబు ప్రకటించిన హామీలపై అంబటి స్పందించారు. ఈ హామీలతో ‘ప్రజల నెత్తిన వాగ్దానాల టోపీ’ పెట్టారని అభివర్ణించారు.

గతంలో యువతకు నిరుద్యోగ భ్రుతి ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, ఇప్పుడు మళ్ళీ మూడు వేలు ఐస్తామని చెబుతున్నారని అంబటి విమర్శించారు. ఎవరూ ఊహించని విధంగా పాలనా చేస్తానన్న బాబు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అంటే గతంలో 14 సంవత్సరాలకంటే గొప్ప పరిపాలన చేస్తారా అని నిలదీశారు. దేశ చరిత్రలోనే మేనిఫెస్టోను భగవద్గీతగా భావించి అమలు చేసిన ఏకైక నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని రాంబాబు స్పష్టం చేశారు. గత పాలనలో పేదవారిని ధనవంతులుగా ఎందుకు చేయలేకపోయారో చెప్పాలని, కనీసం ఒక్క పేదవాడిని ధనవంతుడిగా చేసిన చరిత్ర ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన తర్వాత రాజకీయాలను డబ్బుమయం చేసిందే చంద్రబాబు అని అంబటి నిప్పులు చెరిగారు. నీతిమంతుడినని చెప్పుకొనే అర్హత బాబుకు లేదన్నారు. ఎన్టీఆర్ సైకిల్ గుర్తును ఎలా లాక్కున్నావో ఎవరికీ తెలియదా, ఎన్టీఆర్ కు సింహం గుర్తు వచ్చిందని…. ఒకవేళ ఆయన బతికి ఉంటే బాబు బతుకు బజారు పాలయ్యేదని ఎద్దేవా చేశారు.  మహానాడు వేదికగా కొందరు నేతలు సిఎం జగన్ పై అవాకులు, చెవాకులు పేలారని, కానీ ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీనేనన్న సంగతి గుర్తుంచుకోవాలని అంబటి హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్