Thursday, June 18, 2026
HomeసినిమాDaggubati Abhiram: ఇక ఇప్పుడు అభిరామ్ వంతు! 

Daggubati Abhiram: ఇక ఇప్పుడు అభిరామ్ వంతు! 

దగ్గుబాటి రామానాయుడు గురించి తెలియనివారు ఉండరు. నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనుకునే ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవలసిన వ్యక్తి ఆయన. అలాంటి రామానాయుడు కెరియర్ లో ఎన్నో భారీ విజయాలు .. అరుదైన రికార్డులు కనిపిస్తాయి. సినిమాల పరంగానే కాదు .. వెంకటేశ్ ను ను హీరోగా .. సురేశ్ బాబును నిర్మాతగా నిలబెట్టిన ఘనత ఆయన సొంతం. ఆయన తనయుడిగా ఇండీస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంకటేశ్, అగ్రకథానాయకులలో ఒకరుగా సుదీర్ఘమైన కెరియర్ ను రన్ చేస్తున్నారు.

ఇక ఆ తరువాత చాలా కాలానికి హీరోగా రానా ఎంట్రీ ఇచ్చాడు. అయితే నటనపరంగా తనని తాను మలచుకోవడానికి రానాకి కొంత సమయం పట్టింది. హీరోగా భారీ విజయాలు అందుకోలేకపోయినా, ‘బాహుబలి’తో ఆయన ప్రపంచానికి తెలిశాడు. వివిధ భాషల్లో ఉన్న సర్కిల్ కారణంగా అక్కడి ప్రేక్షకులకు కూడా ఆయన బాగా పరిచయమే. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలతో ఆయన ముందుకు వెళుతున్నాడు. రానా ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నా జనమంతా ఆసక్తిగా ఎదురుచూసే ఒక స్టేజ్ కి ఆయన చేరుకున్నాడు.

ఇక ఇప్పుడు ఆయన తమ్ముడు అభిరామ్ వంతు వచ్చింది. అభిరామ్ సినిమా వాతావరణంలో పుట్టిపెరిగాడని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఆయన హీరోగా తేజ దర్శకత్వంలో ‘అహింస’ సినిమా రూపొందింది. తేజకి అచ్చొచ్చిన ప్రేమకథతోనే అభిరామ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక చాలా కాలంగా సంగీత దర్శకత్వానికి దూరంగా ఉన్న ఆర్పీ పట్నాయక్, ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు వస్తుండటంతో, స్దహజంగానే అంచనాలు ఉన్నాయి. జూన్ 2 వస్తున్న ఈ సినిమాతో,  హీరోగా అభిరామ్ ఎన్ని మార్కులు తెచ్చుకుంటాడో చూడాలి మరి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular