Tuesday, March 17, 2026
Homeసినిమాటాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మరో బ్యూటీ!

టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మరో బ్యూటీ!

తెలుగు తెరపైకి ఇతర భాషల నుంచి కథానాయికలు పొలోమంటూ రావడం చాలా కాలంగా జరుగుతున్నదే. ఇక తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిని అందుకోవడంతో ఇప్పుడు పోటీ మరింత ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలో హిందీతో పాటు తమిళ .. మలయాళ … కన్నడ భాషలకి చెందిన భామలు ఇక్కడ వాలిపోతున్నారు. కథానాయికలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆ జాబితాలోనే తాజాగా గీతిక తివారి పేరు చేరిపోయింది.

గీతిక తివారి మోడల్ .. చాలా కాలంగా ఆమె ఆ రంగంలో కొనసాగుతోంది. తమిళంలో శరవణన్ హీరోగా చేసిన ‘ది లెజెండ్’ సినిమాతో ఆమె కోలీవుడ్ కి పరిచయమైంది. ఇక ఇప్పుడు తెలుగులో ‘అహింస’ సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. దగ్గుబాటి అభిరామ్ హీరోగా తేజ ‘అహింస’ సినిమాను రూపొందించాడు.  అభిరామ్ కి ఇది తెలుగులో మొదటి సినిమా. అందువలన ఈ సినిమా విషయంలో ఒక రేంజ్ లో కేర్ తీసుకుని,  జూన్ 2వ తేదీన థియేటర్లలో దింపుతున్నారు.

ఈ సినిమాలో కథానాయికగా గీతిక తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. తేజ దర్శకత్వంలో .. ఆనంది ఆర్ట్స్ – సురేశ్ ప్రొడక్షన్స్ వంటి పెద్ద బ్యానర్లు కలిసి నిర్మిస్తున్న సినిమా ద్వారా ఆమె పరిచయమవుతుండటం విశేషం. ఈ సినిమాతోనే ఆర్పీ పట్నాయక్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ప్రేమకథలు కొత్త ట్రెండును సృష్టించాయి. మరి గీతిక ఎంట్రీ ఇస్తున్న ఈ ప్రేమకథ కూడా సంచలనాన్ని సృష్టిస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular