Saturday, November 23, 2024
HomeTrending Newsటీచర్లకు వ్యాక్సిన్ : సిఎం జగన్ సూచన

టీచర్లకు వ్యాక్సిన్ : సిఎం జగన్ సూచన

ఆగస్టు 16నుంచి విద్యాసంస్థలు ప్రారంభిస్తున్న దృష్ట్యా వ్యాక్సినేషన్లో టీచర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ మూడో దశ వార్తల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

సమావేశంలో సిఎం జగన్ మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • కాన్సన్ట్రేటర్లు, డీ టైపు సిలిండర్లు, ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై శ్రద్ధ వహించాలి,  దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉంచాలి
  • వీటి నిర్వహణ కోసం జిల్లాల వారీగా ప్రత్యేక సిబ్బందిని నియమించాలి
  • జిల్లా విస్తీర్ణం, ఆస్పత్రుల సంఖ్యను బట్టి తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలి
  • అవసరమైన శిక్షణనూ వీరికి అందించాలి
  • శిక్షణ అనంతరం వీరిని ఆస్పత్రి మేనేజిమెంట్‌కు అప్పగించాలి
  • ఏపీఎంఎస్‌ఐడీసీలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలి
  • ఏపీ ఎంఎస్ఐడీసీ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి
  • 100 బెడ్లు ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి, ప్లాంట్ ఏర్పాటుకు 30 శాతం సబ్సిడీ ఇస్తున్నాం
  • కొత్త మెడికల్ కాలేజీలకు భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి
  • ప్రైవేటు ఆస్పత్రులకు 43.38లక్షల వ్యాక్సిన్ల డోసులు ఇస్తే వాటిలో 5,24, 347 డోసులు మాత్రమే వాడారు
  • మిగిలిన డోసులు ప్రభుత్వానికి ఇస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అవుతుంది
  • కేంద్రానికి మరోసారి లేఖ రాస్తాం
RELATED ARTICLES

Most Popular

న్యూస్