Thursday, June 18, 2026
Homeసినిమానితిన్ మాదిరిగా అభిరామ్ నిలబడేనా?!

నితిన్ మాదిరిగా అభిరామ్ నిలబడేనా?!

మొదటి నుంచి కూడా తేజ కొత్త కుర్రాళ్లతో ఎక్కువగా సినిమాలు చేస్తూ వెళ్లారు. కథలు పట్టుకుని స్టార్స్ చుట్టూ తిరగడం తనకి అలవాటు లేదని చాలా ఇంటర్వ్యూలలో ఆయన చెప్పారు. అందువలన సాధ్యమైనంత వరకూ కొత్త కుర్రాళ్లను హీరోలుగా పరిచయం చేస్తూ ముందుకు వెళ్లారు. అప్పట్లో ఆయన ఎక్కువగా ప్రేమకథలనే తెరకెక్కించేవారు. ఆయన రూపొందించిన ప్రేమకథలు ఒక కొత్త ట్రెండ్ ను సెట్ చేశాయి కూడా. యంగ్ హీరోలంతా తేజ దర్శకత్వంలో ఒక్క సినిమా చేసినా చాలనుకున్న రోజులవి.

‘చిత్రం’ సినిమా ద్వారా ఆయన ఉదయ్ కిరణ్ ను హీరోగా పరిచయం చేశారు. ఆ తరువాత కొంతకాలం పాటు వరుస సినిమాలతో ఉదయ్ కిరణ్ ఎలా దూసుకుపోయింది తెలిసిందే. ఇక ‘జయం’ సినిమా ద్వారా నితిన్ ను పరిచయం చేశాడు. నితిన్ ను కూడా టీనేజ్ లోనే తేజ హీరోగా చూపించాడు .. ప్రేక్షకులను మెప్పించాడు. అప్పటి నుంచి నితిన్ కి ఎదురైన ఫ్లాపులు .. హిట్లు  పక్కన పెడితే, ఆయన హీరోగా అలా నిలబడిపోయాడు. ఇప్పటికీ స్టార్ హీరోగానే  వెళుతున్నాడు.

ఈ నేపథ్యంలో దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ తేజ ‘అహింస’ సినిమాను చేశారు. ఆనంది ఆర్ట్స్ – సురేశ్ ప్రొడక్షన్స్ వారి బ్యానర్లలో నిర్మితమైన ఈ సినిమా, జూన్ 2వ తేదీన థియేటర్లకు రానుంది. ఉదయ్ కిరణ్ .. నితిన్ మాదిరిగానే అభిరామ్ ను కూడా తేజ లవ్ స్టోరీతోనే పరిచయం చేస్తున్నాడు. విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ సినిమా నడుస్తుంది. ఉదయ్ కిరణ్ .. నితిన్ మాదిరిగానే తేజ దర్శకత్వంలో అభిరామ్ ఫస్టు మూవీతోనే హిట్ కొడతాడా? నితిన్ మాదిరిగా నిలబడతాడా? అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular