Tuesday, April 1, 2025
HomeసినిమాGuntur Kaaram: ‘గుంటూరు కారం’ ఘాటు చూపించనున్న మహేష్‌ బాబు

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ ఘాటు చూపించనున్న మహేష్‌ బాబు

‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్‌ బాబు – త్రివిక్రమ్‌ కాంబోలో హ్యాట్రిక్‌ మూవీ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్‌ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. మాస్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘గుంటూరు కారం’ గా టైటిల్‌ ఫైనల్‌ చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు చిత్రబృందం ఓ టీజర్ వీడియో కూడా పంచుకుంది. ఈ సినిమా ఎలా ఉండబోతోందో, ఈ సినిమాలో మహేశ్ బాబు హీరోయిజం ఎలా ఉండబోతోందో ఈ వీడియోతో హింట్ ఇచ్చేశారు.మహేశ్ కెరీర్ లో 28వ చిత్రం కావడంతో ఇప్పటివరకు ఎస్ఎస్ఎంబీ28 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరిపారు. ఇందులో మహేశ్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు. తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్