Monday, March 9, 2026
HomeTrending NewsElections: కాంగ్రెస్ బిజెపిల దొంగజపం - మంత్రి జగదీశ్ రెడ్డి

Elections: కాంగ్రెస్ బిజెపిల దొంగజపం – మంత్రి జగదీశ్ రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంగ జపం చేస్తుండగా,బిజెపి దొంగ జపం చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి ఆ రెండు పార్టీల ధోరణి పై మండిపడ్డారు.అటు కాంగ్రెస్,ఇటు బిజేపి లు చేసే రెండు జపాలు కూడా ప్రజల కోసం కాదని అధికారమే పరమావదిగా పెట్టుకుని జపాలకు పూను కున్నాయని ఆయన విమర్శించారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దశాబ్ది ఉత్సవాల పై బిజెపి, కాంగ్రెస్ ల ధోరణిని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. అధికారం కోసం జరుగుతున్న పరుగు పందెంలో బి ఆర్ ఎస్ పార్టీతో పోటీ పడేందుకే దశాబ్ది ఉత్సావాలను రాజకీయం చేయ జూస్తున్నాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో రాజీనామాలు అంటేనే తోక ముడిచిన ఆ రెండు పార్టీలకు దశాబ్ది ఉత్సవాల గురించి మాట్లాడే నైతికత ఎక్కడిదని మంత్రి జగదీష్ రెడ్డి ఘటుగా ప్రశ్నించారు.

అధికారంలోకి వచ్చిందే తడవుగా 500 మేఘవాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంతో సహా ఏడూ మండలలాలను ఆంధ్రలో కలిపిన బిజెపి పార్టీకీ తెలంగాణ గురుంచి మాట్లాడే హక్కు ఏక్కడదంటూ ఆయన నిలదీశారు. ఏడూ దశాబ్దాలుగా తెలంగాణను గాడాందకారంలోకి నెట్టిన కాంగ్రెస్ పార్టీ దశాబ్ది ఉత్సావాల గురుంచి మాట్లాడడం విడ్డురంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.తెలంగాణ గురించి రాజీనామా అంటేనే తోక ముడిచిన కిషన్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ఉత్సావాల గురించి మాట్లాడడం హాస్య స్పదంగా ఉందన్నారు. తొమ్మిదేళ్లలో ఊహకు మించిన అభివృద్ధిని సాదించుకున్నందునే దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అంతటి అభివృద్ధిలో భాగస్వామ్యం ఆయిన బి ఆర్ ఎస్ శ్రేణులు దశాబ్ది ఉత్సవాలను జయప్రదం చెయ్యాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలో వెలుగు జిలుగులు విరజిమ్ముతున్నాయన్నారు.వరిదిగుబడిలో సాధించిన విజయాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన విజయాలను తార్కాణమని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular