Friday, March 13, 2026
Homeసినిమా'విమానం' ట్రైలర్ రిలీజ్

‘విమానం’ ట్రైలర్ రిలీజ్

తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న వైవిధ్యమైన చిత్రం ‘విమానం’. విలక్ష‌ణ న‌టుడు స‌ముద్రఖ‌ని ఇందులో వీర‌య్య అనే మ‌ధ్య వ‌య‌స్కుడి తండ్రి పాత్ర‌లో న‌టించారు. బస్తీలో ఉండే తండ్రీ కొడుకులు.. పూట గ‌డిస్తే చాల‌నుకునే సంపాద‌న‌.. అలాంటి ఓ పేద కుటుంబంలోని ఉండే పిల్లాడికి విమానం ఎక్కాల‌నే కోరిక పుడుతుంది. అవిటిత‌నంతో తండ్రి బాధ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ కొడుకు కోరిక‌ను తీర్చాల‌నుకుని రాత్రి .. ప‌గ‌లు క‌ష్ట‌ప‌డుతుంటాడు. ‘విమానం’ ఎక్కాల‌నుకునే కొడుకు కోరిక‌ను తీర్చటానికి ఏం చేయాలా అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. ఇది తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉండే ఎమోష‌న్‌.

శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి  ‘విమానం’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను గరువారం (జూన్ 1) రోజున అనుపమ పరమేశ్వరన్ విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. శివప్ర‌సాద్ యానాల మాట్లాడుతూ  ప్రతీ ఒక్క‌రి జీవితాల్లో బ‌ల‌మైన భావోద్వేగాలుంటాయి. అలాంటి ఎమోష‌న్స్‌ను బేస్ చేసుకునే ‘విమానం’ సినిమాను రూపొందించాం. జూన్ 9న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుంది” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular