Thursday, June 18, 2026
Homeసినిమాచిరుతో శ్రీకాంత్ ఓదెల సినిమా..?

చిరుతో శ్రీకాంత్ ఓదెల సినిమా..?

చిరంజీవి వరుసగా సినిమాలు  సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య.. ఇలా స్పీడు పెంచి యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా సినిమాలు చేస్తుండడం విశేషం. వాల్తేరు వీరయ్య సినిమాతో 200 కోట్లకు పైగా కలెక్షన్ రావడంతో చిరు రెట్టించిన ఉత్సాహంతో ‘భోళా శంకర్’ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 11న విడుదల చేయనున్నారు.

భోళా శంకర్ మూవీ తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ప్రకటించలేదు కానీ.. అరడజనుకు పైగా కథలు విని ఓకే చేశారని సమాచారం. ఇలా ఓకే చేసిన కథల్లో దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన శ్రీకాంత్ ఓదెల కథ కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. దసరా సక్సెస్ తర్వాత శ్రీకాంత్ ఓదెలాను చిరంజీవి ఇంటికి పిలిపించి అభినందించారట. ఆ టైమ్ లో మంచి కథ ఉంటే చెప్పు సినిమా చేద్దామని ఆఫర్ ఇచ్చారట. ఇదే మంచి సమయం అనుకున్న శ్రీకాంత్ ఓదెల చిరు కోసం తను రాసుకున్న స్టోరీ లైన్ వినిపించాడని సమాచారం.

శ్రీకాంత్ చెప్పిన స్టోరీ లైన్ చిరుకు బాగా నచ్చడంతో… వెంటనే ఫుల్ స్టోరీ రెడీ చేయి సినిమా చేద్దామని మాట ఇచ్చారట. శ్రీకాంత్ ఇప్పుడు ఫుల్ స్టోరీ రెడీ చేసే పనిలో ఉన్నాడని టాక్ వినిపిస్తుంది. ఇటీవల చిరంజీవి కళ్యాణ్‌ కృష్ణ, బి.వి.ఎస్.రవి, వశిష్ట్ తదితరులు చెప్పిన కథలు విన్నారు. వీటిలో శ్రీకాంత్ చెప్పిన స్టోరీ బాగా నచ్చడంతో ఈ కథ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే.. శ్రీకాంత్ త్వరగా ఫుల్ స్టోరీ రెడి చేస్తే.. వెంటనే స్టార్ట్ అవుతుంది. కాస్త ఎక్కువ టైమ్ తీసుకుంటే.. కళ్యాణ్ కృష్ణతో సినిమా చేసే ఛాన్స్ ఉందని టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular