Tuesday, June 16, 2026
Homeసినిమారాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన సమంత

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన సమంత

సమంత ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని తెరకెక్కించిన రాజ్ & డీకే దర్శకత్వంలో సిటాడెల్ సిరీస్ తెరకెక్కుతుండగా వరుణ్ ధావన్, సమంత మెయిన్ లీడ్స్ లో నటిస్తున్నారు. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ కి ఇది ఇండియన్ వర్షన్ అని, ప్రీక్వెల్ అని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సిరిస్.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న సమంత తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకున్నారు. రాష్ట్రపతితో కలిసి సమంత దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి సెర్బియాలో పర్యటించారు. సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం సమంత కూడా సెర్బియాలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సమంత రాష్ట్రపతిని కలిసినట్లు తెలుస్తోంది. సిటాడెల్ సినిమా యూనిట్ తో కలిసి వెళ్లి ద్రౌపది ముర్మును కలిసినట్లు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ట్వీట్ చేశారు.
గౌరవనీయులైన భారత రాష్ట్రపతిని కలిసే అవకాశం కలిగింది. సెర్బియాలో ద్రౌపది ముర్ము మేడంను కలిశాం.. మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అంటూ వరుణ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ఫొటోలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, వరుణ్ ధావన్, సమంత ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular