Monday, June 15, 2026
HomeTrending Newsఉద్యోగులకు కష్టం రానివ్వం: సిఎం భరోసా

ఉద్యోగులకు కష్టం రానివ్వం: సిఎం భరోసా

ఉద్యోగుల విషయంలో రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సిఎం జగన్ ను కలుసుకున్నారు.  పీఆర్సీ ఏర్పాటు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, జీపీఎస్‌ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశాయి. ఆ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములన్న తమ విధానానికి కట్టుబడి ఉన్నామని,  ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసిస్తున్నామని,  ప్రభుత్వం నుంచి వారికి జరగాల్సిన మంచి ఏదైనా తప్పకుండా చేస్తామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ

  • మీ మనసుకు కష్టం కలగకుండా చూడాలన్నదే మా ఉద్దేశం.
  • అందుకే పెన్షన్ సహా కొన్ని పరిష్కారాలకోసం రెండేళ్లుగా తపనపడ్డాం
  • గతంలో ఎవ్వరూ కూడా ఈ సమస్యలకు పరిష్కారం చూపించడానికి తపనపడ్డ సందర్భాలు లేవు
  • ఉద్యోగులకు పరిష్కారం దొరకాలి, అంతేకాకుండా భావితరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి, అందుకే  జీపీఎస్ తీసుకువచ్చాం.
  • రిటైర్డ్‌ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేదిగా దీన్ని రూపొందించాం
  • 62 ఏళ్లకు రిటైర్‌అయితే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలి
  • అందుకే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్ లు ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచాం
  • ఉద్యోగులకు న్యాయం జరగాలి. సీపీఎస్ లో లేనివి జీపీఎస్‌లో ఉన్నాయి
  • రెండేళ్లపాటు జీపీఎస్‌పై ఆర్థికశాఖ సుదీర్ఘ కసరత్తు చేసింది
  • కాంట్రాక్ట్‌ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కూడా మంచి ఆలోచన చేశాం
  • సుప్రీంకోర్టు తీర్పులనుకూడా పరిగణలోకి తీసుకున్నాం
  • వారికి మంచి చేయాలన్న ఆలోచనతో అడుగులు ముందుకేశాం
  • అలాగే వైద్యవిధాన పరిషత్‌ ఉద్యోగులనుకూడా ప్రభుత్వంలో విలీనం చేశాం.
  • వారికి మంచి పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular