Friday, September 20, 2024
HomeTrending NewsBRS: నామ్ దారీ నహీ.. కామ్ దారీ హోనా - కేసీఆర్

BRS: నామ్ దారీ నహీ.. కామ్ దారీ హోనా – కేసీఆర్

ఢబ్బయైదేండ్ల స్వతంత్ర భారత దేశంలో కేంద్రంలోని పాలన ఇంకా లక్ష్యాన్ని విస్మరించి నిర్లక్ష్యం గానే కొనసాగుతున్నదని, దశ దిశ లేని పరిపాలన దేశ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా పరిణమించిందని, ఈ దిశగా చైతన్యమై, పార్టీలను కాకుండా తమ ఆకాంక్షలను గెలిపించుకోవాల్సిన అవసరమున్నదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంకా కూడా…పార్టీ ఫౌండర్లు సిద్దాంతకర్తలు తాతల తండ్రుల పేర్లు చెప్పుకోని రాజకీయాలు చేసే పరిస్థితులు చెల్లవని, ఇప్పుడు దేశ ప్రజలకు ‘ పేర్లతో పనిలేదు.. పని చేయగలిగిన వాల్లతోనే పని (నామ్ దారీ నహీ కామ్ దారీ హోనా చాహియే) అని స్పష్టం చేశారు.
బిఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర తో పాటు మధ్యప్రదేశ్ నుంచి కూడా చేరికలు ఊపందుకున్నాయి. మధ్యప్రదేశ్ బిఆర్ఎస్ సమన్వయకర్తగా మాజీ ఎంపీ బుద్దసేన్ పటేల్ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు సహా మరో రెండువందల మంది కీలక రాజకీయ నేతలు ఆదివారం అధినేత సిఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మధ్యప్రదేశ్ బిఆర్ఎస్ సమన్వయకర్త మాజీ ఎంపీ బుద్దసేన్ పటేల్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారిలో…చాంద్వాడా జిల్లా, జున్నార్ దేవ్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే రామ్ దాస్ యికే సర్వజన్ కళ్యాణ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్ యాదవ్, గోండ్వానా పార్టీ అధ్యక్షుడు శోభారామ్ బాలావి, భువన్ సింగ్ కోరం, లక్ష్మణ్ మస్కోలే తో పాటు దాదాపు 200 మంది సీనియర్ రాజకీయనాయకులు ప్రజా సంఘాల నేతలు మేధావులు తదితరులు బిఆర్ఎస్ లో చేరారు.


ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ…  పనివిధానం లో మార్పు తీసుకువచ్చే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలదే (నామ్ బదల్నేసే కుచ్ నహీ హోతా…కామ్ బదల్నా చాహియే) అని స్పష్టం చేశారు.
బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే గెలిచిన రెండేండ్లల్లో భారతదేశ ప్రజలకు రైతాంగానికి అవసరమైన విద్యుత్తును 24 గంటలు అందచేస్తామని సిఎం పునరుద్ఘాటించారు. బిఆర్ఎస్ పార్టీ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని, భారత దేశాన్ని మార్చడానికి ఏర్పాటు చేసిన మిషన్ అని స్పష్టం చేశారు.
‘దిల్ వాలే దిమాఖ్ వాలే’ ఐక్యం కావాల్సిన అవసరమున్నదన్నారు. తప్పుడు వాగ్దానాలతో విద్వేషాలు రెచ్చగొడుతూ ఏమైనా చేసి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కొనసాగుతున్న దుర్మార్గాలను నిలవరించడంలో ఎలక్షన్ కమిషన్ వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. త్వరలోనే మధ్యప్రదేశ్ భోపాల్ లో బిఆర్ఎస్ పార్టీకి స్వంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుందామని తెలిపారు. మధ్యప్రదేశలోని అన్ని నియోజకవర్గాల్లో వాహనాలను ఏర్పాటు చేసుకుని పార్టీ భావజాలాన్ని ప్రచార సామాగ్రిని గ్రామ గ్రామన తిప్పాలని ప్రజలను చైతన్యం చేయాలని అధినేత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా…బిఆర్ఎస్ నేతలు శంకరన్న దోంగ్డే, మాణిక్ కదమ్, హిమాన్షు తివారి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, మెట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్