Tuesday, June 16, 2026
Homeసినిమాపవర్ స్టార్ 'ఓజీ' ఇంట్రస్టింగ్ న్యూస్

పవర్ స్టార్ ‘ఓజీ’ ఇంట్రస్టింగ్ న్యూస్

పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న సినిమా ‘ఓజీ’. ఈ చిత్రానికి సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి ఈ సినిమా పై ఆసక్తి ఏర్పడింది. సుజిత్ పవర్ స్టార్ అభిమాని కావడంతో తన అభిమాని హీరోని సూపర్ స్టైలీష్ గా ప్రెజెంట్ చేస్తాడని టాక్ ఉంది. ఈ మూవీలో పవన్ ఎలివేషన్లు ఓ రేంజ్ లో ఉంటాయని అభిమానులు చాలా అంచనాలతో ఉన్నారు. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

పవన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో లాస్ట్ లో స్టార్ట్ చేసినప్పటికీ.. ఆయన ఎక్కువ ప్రయారిటీ ఈ సినిమాకే ఇచ్చి చకచకా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిగా.. గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్లు ఇప్పటికే బయటికి వచ్చిన ప్రోమోలు, ఫొటోలను బట్టి అర్థమైంది. కాగా ఓజీ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. అది ఏంటంటే… ఇది పీరియడ్ ఫిలిం. అయితే..  పీరియడ్ అంటే 20, 30 ఏళ్ల ముందు నడిచే కథ అనుకుంటే పొరపాటే. ఏకంగా 70 ఏళ్లు వెనక్కి వెళ్లి.. అప్పటి నేపథ్యంతో కథను నడిపించబోతున్నారట.

1950 ప్రాంతంలో నడిచే కథగా దీన్ని తీర్చిదిద్దుతున్నాడట సుజీత్. అప్పటి పరిస్థితులను రీక్రియేట్ చేయడం.. పవన్‌ ఇమేజ్‌కు తగ్గట్లుగా సినిమాను రూపొందించడం అంటే సవాలుతో కూడుకున్న విషయమే. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ఇటీవలే తమిళ నటుడు అర్జున్ దాస్‌ను ఎంచుకున్నారు. మొత్తానికి ఓజీ పై మరింత ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular