Friday, June 19, 2026
Homeసినిమా'లియో' నుంచి విజయ్ ఫస్టులుక్ పోస్టర్ రిలీజ్!

‘లియో’ నుంచి విజయ్ ఫస్టులుక్ పోస్టర్ రిలీజ్!

కోలీవుడ్‌కు చెందిన హీరోనే అయినా.. తెలుగుతో పాటు దక్షిణాది మొత్తంలోనూ ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను పెంచుకుంటూ.. ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్‌ను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ఒకడు. విలక్షణమైన యాక్టింగ్‌తో పాటు అన్ని రకాల టాలెంట్లతో మెప్పిస్తోన్న అతడు.. సుదీర్ఘ కాలంగా సౌత్‌లో హవాను చూపిస్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు విజయ్ ‘లియో’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

విజయ్ 67వ సినిమాగా రూపొందుతున్న ‘లియో’ సినిమా అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. ఇంతకుముందు విజయ్ కి ‘మాస్టర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. లలిత్ కుమార్ – జగదీశ్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఈ సినిమాలో విజయ్ కనిపించనున్నాడు.

ఈ రోజున విజయ్ బెర్త్ డే .. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. మంచుకొండల నేపథ్యంలో బలమైన సుత్తినే ఆయుధంగా ఉపయోగిస్తూ ఆయన శత్రు సంహారం చేస్తున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. మంచుకొండల నేపథ్యంలో నడిచే కథ ఏమిటి? హీరో ఎందుకు అంత వైలెంట్ గా మారిపోయాడు? అనేది సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

విజయ్ – అనిరుధ్ కాంబినేషన్ ఇప్పుడు బాగా పాప్యులర్ అయింది. అందువలన ఈ ఇద్దరూ కలిసి చేయబోయే మ్యూజికల్ ఫీస్ట్ కోసం అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. బలమైన తారాగణం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా కనిపిస్తోంది. ఆ జాబితాలో త్రిష .. సంజయ్ దత్ .. అర్జున్ .. ప్రియా ఆనంద్ .. గౌతమ్ మీనన్ .. మన్సూర్ అలీఖాన్ కనిపిస్తున్నారు. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular