Tuesday, June 16, 2026
Homeసినిమా'గేమ్ ఛేంజర్' మరింత ఆలస్యం కానుందా..?

‘గేమ్ ఛేంజర్’ మరింత ఆలస్యం కానుందా..?

చరణ్‌, శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. ప్రారంభం అయినప్పుడు చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరిగింది. అయితే.. శంకర్ ‘ఇండియన్ 2’ సినిమాను కూడా చేయాల్సిరావడంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యం అవుతుంది. ఓ నెల గేమ్ ఛేంజర్ షూటింగ్ చేస్తే.. మరో నెల ఇండియన్ 2 షూటింగ్ చేస్తున్నారు. చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అందుకనే గత కొన్ని రోజులుగా గేమ్ ఛేంజర్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ఇండియన్ 2 షూటింగ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ మూవీ మరింత ఆలస్యం అయ్యేలా ఉందని వార్తలు వస్తున్నాయి. మేటర్ ఏంటంటే.. చరణ్‌ కూతురు పుట్టిన ఆనందంలో ఉన్నారు. పెళ్లైన 11 సంవత్సరాల తర్వాత పుట్టడడంతో మెగా కాంపౌండ్ లో సంబరాలు జరుగుతున్నాయి. రోజూ ఎవరో ఒకరు వస్తున్నారు. ఏదో ఒక పార్టీ జరుగుతుంది. దీంతో తను చేస్తున్న సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చాడు చరణ్‌. కొన్నాళ్లు పాటు భార్య, కూతురుతో పాటే ఉండాలని డిసైడ్ అయ్యాడట. దీంతో సినిమా మరోసారి వాయిదా పడడం ఖాయం అని వినిపిస్తుంది.

ఈ సంవత్సరంలోనే గేమ్ ఛేంజర్ మూవీని విడుదల చేయాలి అనుకున్నారు. ఆతర్వాత ఇండియన్ 2 వస్తుండడంతో గేమ్ చేంజర్ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆతర్వాత సంక్రాంతికి రావాలి అనుకోవడంతో సమ్మర్ కి గేమ్ ఛేంజర్ తీసుకురావాలి అనుకున్నారు. ఇప్పటి వరకు చరణ్ చిత్రం 70 శాతం మాత్రమే షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు కూతురు పుట్టిన ఆనందంలో చరణ్‌ సినిమాలకు కాస్త లాంగ్ గ్యాప్ తీసుకోవడంతో గేమ్ ఛేంజర్ సమ్మర్ కి కూడా రావడం లేదని మరింత ఆలస్యం అవుతుందని వార్తలు వస్తున్నాయి. మరి.. గేమ్ ఛేంజర్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular