Wednesday, June 17, 2026
Homeసినిమాప్రాజెక్ట్ కే గురించి కమల్, నాగ్ అశ్విన్ రియాక్షన్ ఏంటి..?

ప్రాజెక్ట్ కే గురించి కమల్, నాగ్ అశ్విన్ రియాక్షన్ ఏంటి..?

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే.  గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో యూనివర్శిల్ హీరో కమల్ హాసన్ నటించనున్నారని వార్తలొచ్చాయి. ఇది కేవలం గ్యాసిప్ అనుకున్నారు. కానీ  ఈ సినిమాలో కమల్ నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చింది,  దీంతో ప్రాజెక్ట్ కే పై క్రేజ్ మరింత పెరిగింది.

ఈ సినిమాలో కమల్ నటించడం గురించి నాగ్ అశ్విన్ స్పందించారు. “కమల్ హాసన్ ఒక లెజెండ్, ఈ సినిమా లోని పాత్ర కోసం ఈ లెజెండ్ మాకు అవసరం. ఆయన నుంచి నేర్చుకోడానికి వెయిట్ చేయలేకపోతున్నాను” అన్నారు. ఇక కమల్ కూడా స్పందించారు. “50 ఏళ్ల కిందట నేను డ్యాన్స్ అసిస్టెంట్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా చిత్ర రంగంలో ప్రస్థానం ప్రారంభించాను. ఆ సమయంలో నిర్మాతగా అశ్వినీదత్ పేరు బలంగా వినిపించేది. ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత ఇద్దరం కలిశాం. నాగ్ అశ్విన్ రూపంలో ఓ మేధావి అయిన యువ దర్శకుడు తదుపరి తరం నుంచి తెర పైకి వచ్చాడు. ప్రాజెక్ట్-కే చిత్రంలో నా సహనటులు ప్రభాస్, దీపికా పదుకొనే కూడా ఈ ఆధునిక తరానికి చెందినవారే. ఇక, అమితాబ్ బచ్చన్ తో నేను గతంలో పని చేశాను కానీ ఆయనతో ఎప్పుడు పని చేసినా ఇదే మొదటిసారి అన్నట్టుగా అనిపిస్తుంది. అమితాబ్ తనను తాను ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. నేను కూడా ఆయనలాగే సరికొత్తగా ఉండాలని ప్రయత్నిస్తుంటాను” అని కమల్ అన్నారు.

“నేను సినిమా పిచ్చోడ్ని. అందుకే సినిమా రంగంలో ఏ కొత్త ప్రయత్నం నా దృష్టికి వచ్చినా అభినందిస్తుంటాను. ఇప్పుడు ప్రాజెక్ట్-కే చిత్రాన్ని కూడా మొదటగా నేనే అభినందించాలనుకుంటున్నాను. నాగ్ అశ్విన్ తనదైన ఆలోచన విధానంతో ప్రాజెక్ట్-కే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న తీరు దేశ వ్యాప్తంగానూ, ప్రపంచ సినిమా రంగంలోనూ మార్మోగడం ఖాయమని ఖచ్చితంగా చెప్పగలను” అంటూ లేఖలో పేర్కొన్నారు. మరి.. ఈ పాన్ వరల్డ్ మూవీ వరల్డ్ వైడ్ గా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular