Saturday, September 21, 2024
Homeసినిమా'భాగ్ సాలే' శ్రీ సింహాకు పెద్ద హిట్ కావాలి - కార్తికేయ

‘భాగ్ సాలే’ శ్రీ సింహాకు పెద్ద హిట్ కావాలి – కార్తికేయ

శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన సినిమా ‘భాగ్ సాలే’. నేహా సోలంకి నాయికగా కనిపించనుంది. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో  క్రైమ్ కామెడీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జూలై 7న భాగ్ సాలే విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను హీరో కార్తికేయ విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరోయిన్ నందినీ రాయ్ మాట్లాడుతూ .. ఈ సినిమా, ఈ క్యారెక్టర్ నాకు చాలా చాలా స్పెషల్. నా కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇలాంటి మంచి అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. కాలభైరవ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకు కంగ్రాట్స్ చెబుతున్నాం. జూలై 7 గుర్తుపెట్టుకోండి. మా సినిమాను థియేటర్ లో చూడండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అన్నారు.

హీరో శ్రీ సింహా కోడూరి మాట్లాడుతూ .. ఈ చిత్రంలో నా పాత్ర పేరు అర్జున్. అతనో టక్కరి దొంగ. తను చేయాలనుకున్నవి చేసేసినట్లు కటింగ్ ఇస్తుంటాడు. తన పని అయ్యేలా చూసుకుంటాడు. విలువైన ఉంగరం దొరకడం వల్ల అర్జున్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా సక్సెస్ పట్ల నమ్మకంతో ఉన్నాం అన్నారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ .. భాగ్ సాలే ట్రైలర్ చూశాను. ఈ ట్రైలర్ చూశాక టైటిల్ బాగా సెట్టయింది అనిపించింది. చాలా ఎంటర్ టైనింగ్ గా సినిమా ఉంటుంది. సినిమాలోని అన్ని క్యారెక్టర్స్ ఎనర్జీతో ఉన్నాయి. ఇప్పటిదాకా భాగ్ సాలే అంటే మహేష్ పాట గుర్తుకొచ్చేది. ఇప్పుడీ సినిమా గుర్తుకొస్తుంది. తన ఇంట్లో ఎంతో మంది గొప్ప టెక్నీషియన్స్ ఉన్నా..శ్రీసింహా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతని సింప్లిసిటీ నాకు బాగా నచ్చుతుంది. ఈ సినిమా శ్రీ సింహాకు పెద్ద హిట్ కావాలి అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్