ప్రభాస్, ఓంరౌత్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రం పై విమర్శలు రావడం తెలిసిందే. ఈ సినిమా పై విమర్శలు వచ్చినప్పటికీ ఫస్ట్ వీక్ బాగానే కలెక్షన్స్ రాబట్టింది. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్స్ షేర్ రాబట్టిన సినిమాల జాబితా చూస్తే.. ఫస్ట్ ప్లేస్ లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ నిలిచింది. ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీక్ లో 172 కోట్లు షేర్ కలెక్ట్ చేసి టాప్ లో ఉంది. ఇక రెండో స్థానంలో బాహుబలి 2 మూవీ నిలిచింది. ఈ సంచలన చిత్రం 107.21 కోట్ల షేర్ ని మొదటి వారం కలెక్ట్ చేసింది.
అయితే.. ఈ రెండు చిత్రాలు కూడా రాజమౌళి నుంచి వచ్చినవే కావడం విశేషం. మూడో స్థానంలో అల్లు అర్జున్ అల.. వైకుంఠపురం లో నిలిచింది. ఈ సినిమాకి మొదటి వారం రికార్డు స్థాయిలో 81.66 కోట్ల షేర్ వచ్చింది. అల.. వైకుంఠపురములో చిత్రం తర్వాత నాలుగవ స్థానంలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ మూవీ నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ఏకంగా 76.08 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడం విశేషం. ఇక ఐదవ స్థానంలో మెగాస్టర్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమా నిలిచింది.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య చిత్రం ఫస్ట్ వీక్ లో 75.47 కోట్ల షేర్ ని రాబట్టి ఈ ఏడాది లో హైయెస్ట్ షేర్ కలెక్ట్ చేసిన మూవీగా నిలిచింది. ఇప్పుడు ఆరవ స్థానంలో ప్రభాస్ ఆదిపురుష్ చిత్రం నిలిచింది. ఈ మూవీ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ… మొదటి వారంలో 73.27 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. మరి.. లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.