Friday, September 20, 2024
Homeసినిమాప్రభాస్, హరీష్ శంకర్ మూవీ..?

ప్రభాస్, హరీష్ శంకర్ మూవీ..?

ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. దేశ వ్యాప్తంగా భారీగా క్రేజ్ ఉండడంతో కోలీవుడ్, బాలీవుడ్ మేకర్స్ ప్రభాస్ తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మాలీవుడ్ మేకర్స్ కూడా ప్రభాస్ తో మూవీని ప్లాన్ చే్స్తున్నారు. ఇంతకీ ఎవరంటే.. కేవీఎన్ ప్రొడక్షన్. కన్నడలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన కేవీఎన్ ప్రొడక్షన్ కన్నడ రైటర్లతో ఓ స్టోరీ రాయించిందట. అయితే.. ఆ స్టోరీని తెరకెక్కించే దర్శకుడు ఎవరైతే బాగుంటురా అని బాగా ఆలోచించి ఫైనల్ గా హరీష్ శంకర్ అయితే.. పర్ ఫెక్ట్ గా డీల్ చేయగలరని ఫిక్స్ అయ్యారట.

అయితే.. ఇది పాన్ ఇండియా స్టోరీనా?  కాదా? అన్నది మరో సందేహం. కేవీఎన్ సంస్థ ఈ మధ్యనే ప్రభాస్ కి  రెండు.. మూడు స్టోరీలు నేరెట్ చేసిందిట. అందులో ఒకటి బాగుందని ప్రభాస్ అన్నారని సమాచారం.  ప్రస్తుతం ఓ వైపు సలార్, మరో వైపు మారుతితో సినిమా, అలాగే ప్రాజెక్ట్ కే చేస్తూ బిజీగా ఉన్నారు. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్. ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి. ఈ సినిమాలు పూర్తైన తర్వాత అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ అనే సినిమా చేయాలి.

అయితే.. కేవీఎన్ సంస్థ నిర్మించే చిత్రాన్ని స్పిరిట్ కంటే ముందు సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటుందట. ఈ విషయాన్ని ప్రభాస్ కు చెబితే సానుకూలంగా స్పందించినట్లు టాక్. మరో వైపు హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. త్వరలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలి. వచ్చే సంవత్సరం సమ్మర్ కి ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కానుంది. ఆతర్వాత ప్రభాస్ తో హరీష్ శంకర్ మూవీ ఉండచ్చు అని టాక్ వినిపిస్తుంది. అయితే… ప్రచారంలో ఉన్నది నిజమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్