Tuesday, September 24, 2024
Homeసినిమాన్యూ లుక్ లో రామ్.  టైటిల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు..?

న్యూ లుక్ లో రామ్.  టైటిల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు..?

రామ్, బోయపాటి కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ కు జంటగా శ్రీలీల నటిస్తుంది. అఖండ తర్వాత బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంది. ఇంకా చెప్పాలంటే.. ఈ సినిమా పై అంచనాలను మరింతగా పెంచేసింది. ఇదిలా ఉంటే.. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్స్ ని ఫాలో అయ్యే హీరో రామ్ తాజాగా న్యూ ట్రెండీ స్టైల్ లుక్ లో అదరగొట్టారు. టోటల్ గా బ్లాక్ ఔట్ ఫిట్స్ తో పాటు గాగుల్స్ కూడా పెట్టుకున్న రామ్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా రామ్, బోయపాటి ల సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుండగా దీనిని సెప్టెంబర్ 15న గ్రాండ్ గా పలు భాషల్లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కానీ.. ఇంతకీ సినిమా టైటిల్ ఏంటి అనేది ప్రకటించలేదు. ఇది బోయపాటి స్టైల్. అఖండ సినిమా విషయంలో కూడా ఇలాగే చేశారు. రిలీజ్ దగ్గర పడుతున్న టైమ్ లో టైటిల్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నారు. ఈ మూవీ టైటిల్ ను అతి త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి ‘స్కంధ’ అనే టైటిల్ అనుకుంటున్నారు. దాదాపుగా ఈ టైటిల్ నే ఫిక్స్ అయ్యారు. మంచి ముహూర్తం చూసి ప్రకటిస్తారు.  రామ్, బోయపాటి ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా మూవీ చేశారు. మరి.. ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్