Saturday, September 21, 2024
HomeTrending NewsBavapur kurru: బావపూర్ కుర్రు పై పోస్ట్ కార్డ్ ఆవిష్కరణ

Bavapur kurru: బావపూర్ కుర్రు పై పోస్ట్ కార్డ్ ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పోస్టల్ కవర్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  ఈ రోజు విడుదల చేశారు. అనంతరం తెలంగాణలో బౌద్ధ సంప్రదాయాన్ని ప్రతిభింబించే బావపూర్ కుర్రు పై పోస్ట్ కార్డ్ ను ఆవిష్కరించారు. హైదరాబాద్ అబిడ్స్ లోని డాక్ సదన్, చీఫ్ పోస్ట్ మాస్టర్ కార్యాలయంలో జరిగిన అవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకమైన పోస్టల్ కవర్‌ను విడుదల చేసుకోవడంతో పాటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతంలోని ‘బావాపూర్ కుర్రు’ గ్రామంలో తెలంగాణలో బౌద్ధ సంప్రదాయాన్ని గుర్తుచేసుకుంటూ.. పోస్టు కార్డు ఆవిష్కరించుకుంటున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.

కిషన్ రెడ్డి ప్రసంగంలో ముఖ్యాంశాలు …

తెలంగాణలో బౌద్ధ సంప్రదాయాన్ని ప్రతిబింబించే 5వ శతాబ్దం నాటి ప్రాంతాలను గుర్తుచేసుకోవడం దీన్ని ఓ పోస్టు కార్డు ఆవిష్కరణ ద్వారా మరోసారి మన సమాజానికి గుర్తుచేసే ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. తెలంగాణ పోస్టల్ శాఖ 5 పోస్టు కార్డుల సెట్‌ను విడుదల చేయడం సంతోషకరం. 2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినా.. 2016 జూలై 1వ తేదీన తెలంగాణ పోస్టల్ సర్కిల్ ఏర్పడటం ద్వారా మన రాష్ట్రంలో పోస్టల్ సేవలను మరింతగా విస్తరించేందుకు వీలుపడింది. ఇందుకోసం ఈ సర్కిల్‌లో 2 పోస్టల్ రీజియన్లు, 17 పోస్టల్ డివిజన్లు, 2 RMS డివిజన్లు 6,208 పోస్టాఫీసుల ద్వారా మారుమూల ప్రాంతాల వరకు కూడా పోస్టల్ సేవలు అందుతున్నాయి. 2014లో కేంద్రంలో మోదీ పగ్గాలు చేపట్టాక.. మన రాష్ట్రంలోని 5,796 పోస్టాఫీసులను ఆధునీకరించాం. ఇందుకోసం కేంద్రం.. ఈ 9 ఏళ్లలో 7,489 కోట్లు ఖర్చు చేసింది. సాంకేతికత పరంగా, మౌలిక వసతుల పరంగా ఈ ఆధునీకరణ జరిగింది.

266 పోస్టాఫీసుల్లో ఆధార్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. వినియోగదారుల సేవలను 3,571 పోస్టాఫీసుల్లో అందిస్తున్నాం. దీని ద్వారా ప్రజల్లో మళ్లీ పోస్టాఫీసు సేవలపై విశ్వాసం పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 33 లక్షల ‘ఇండియా పోస్ట్ పేమెంట్స్’ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. తెలంగాణ పోస్టాఫీసుల ద్వారా 258 సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 159 సేవలు.. పోస్ట్‌మెన్‌లు, గ్రామీణ డాక్ సేవక్‌లు.. వినియోగదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అందిస్తున్నారు. 33 సేవలు ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు గ్రామాల్లో విద్యుత్ బిల్లులు, నీటి, గ్యాస్ బిల్లులు చెల్లించడం, మొబైల్స్ రీచార్జ్ చేసుకోవడం వంటివాటికోసం 6 లక్షలకు పైగా మంది పోస్టాఫీసుల సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. సుకన్య సమృద్ధి యోజన (9.5 లక్షల మంది చిన్నారుల పేర్లతో), మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా రెండేళ్ల సమయానికి 7.5 శాతం వడ్డీకి రుణాలు ఇవ్వడం ద్వారా దాదాపు 50వేల మంది మహిళలకు ప్రయోజనం జరిగింది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్