Saturday, September 21, 2024
Homeసినిమాబన్నీతో భారీగా ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్

బన్నీతో భారీగా ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల.. వైకుంఠపురములో’ చిత్రాలు మంచి సక్సెస్ సాధించాయి. ఈ క్రేజీ కాంబోలో మరో సినిమా రాబోతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ దీన్ని నిర్మించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కూడా భాగస్వామిగా చేరనుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.

అయితే.. ఇప్పుడంతా  పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. రాజమౌళి తర్వాత సుకుమార్ ఆ రేంజ్ కి వెళ్లిపోయాడు కానీ.. త్రివిక్రమ్ మాత్రం ఇంకా ఫ్యామిలీ స్టోరీస్ తీసుకుంటూ ఇక్కడే ఉండిపోయాడు. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా రూటు మార్చి యాక్షన్ మూవీ చేసి పాన్ ఇండియా డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారు. మహేష్ బాబుతో చేస్తున్న సినిమాను ఈ దిశగానే రూపొందించాలని అనుకున్నా మహేష్ బాబు కథ మార్చడంతో ప్లాన్ మారింది. ఈసారి కూడా తెలుగుకే పరిమితమయ్యారు త్రివిక్రమ్.

మహేష్ తర్వాత బన్నీతో సినిమా చేయనున్నారు. ఈ సినిమా కోసం భారీ యాక్షన్ స్టోరీ రెడీ చేశారు. బన్నీ, త్రివిక్రమ్ కలిసి ఎన్నో రోజులు చర్చించుకుని కథను రెడీ చేశారట. ఇప్పటి వరకు త్రివిక్రమ్ నుంచి వచ్చిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. మహేష్‌ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ బ్రో, ఓజీ చిత్రాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. మొత్తానికి త్రివిక్రమ్ జనవరికి ప్రీ అవుతారు. ఇక బన్నీ ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్నారు. సమ్మర్ కి ఫ్రీ అవుతారు. ఆతర్వాత బన్నీ, త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వస్తుందని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్